Fact Check : టోక్యో ఒలింపిక్స్ లో యాంటీ సెక్స్ బెడ్స్ ను అథ్లెట్ల కోసం ఏర్పాటు చేశారా..?

Anti Sex Beds in Tokyo Olympics No Way. టోక్యో ఒలింపిక్స్ అతి త్వరలోనే జరగబోతూ ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో విషయాలు బయటకు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 July 2021 11:02 AM IST
Fact Check : టోక్యో ఒలింపిక్స్ లో యాంటీ సెక్స్ బెడ్స్ ను అథ్లెట్ల కోసం ఏర్పాటు చేశారా..?

టోక్యో ఒలింపిక్స్ అతి త్వరలోనే జరగబోతూ ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. వీటిలో ఆసక్తికరంగా బెడ్ గురించిన సమాచారం వైరల్ అవుతోంది. బెడ్స్ కార్డ్ బోర్డుతో ఏర్పాటు చేశారని స్పష్టంగా తెలుస్తోంది. కార్డ్ బోర్డు పడకలతో పాటు 'టోక్యో 2020' ఉన్న నీలం దుప్పటితో పడకల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అథ్లెట్లలో సాన్నిహిత్యాన్ని నివారించడానికి ఒలింపిక్ అథ్లెట్లకు ఈ కార్డ్బోర్డ్ 'యాంటీ సెక్స్' పడకలు ఇచ్చినట్లు నెటిజన్లు పేర్కొన్నారు.

టోక్యో ఒలింపిక్స్ అథ్లెట్లకు "యాంటీ-సెక్స్ బెడ్": జపాన్లో COVID-19 విస్తృతంగా వ్యాపించడం వలన అథ్లెట్లకు సామాజిక దూరాన్ని కొనసాగించడానికి టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు "యాంటీ సెక్స్ బెడ్" ను ఏర్పాటు చేశారు "అని వైరల్ అవుతున్నాయి ఫోటోలు..!


అమెరికన్ డిస్టెన్స్ రన్నర్, ఒలింపిక్ పతక విజేత పాల్ చెలిమో కూడా ఈ పడకలను "సాన్నిహిత్యాన్ని నివారించడానికి" నిర్మించారని ట్వీట్ చేశారు.

ఆర్కైవ్ చేసిన లింక్స్:

https://web.archive.org/web/20210721032940/https://twitter.com/total_sportt/status/1416661656915095552

https://web.archive.org/web/20210721033002/https://twitter.com/Paulchelimo/status/1416240846039523331

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న వార్తల్లో 'ఎటువంటి నిజం లేదు'.

ఐరిష్ జిమ్నాస్ట్ రైస్ మెక్‌క్లెనాఘన్ ఈ వైరల్ పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదని' తెలిపారు. ట్విట్టర్‌లో డౌట్స్ ను నివృత్తి చేస్తూ వీడియోను పోస్టు చేశారు. అతను పదేపదే మంచం మీద దూకుతున్న వీడియోను పోస్టు చేశారు. "ఒలింపిక్ క్రీడల గురించి ఈ రోజు నకిలీ వార్తల ఎపిసోడ్ కు ఎండ్ కార్డు వేస్తున్నానని తెలిపారు. పడకలు 'యాంటీ సెక్స్ బెడ్స్' అంటూ వైరల్ అవుతున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని" అతను తెలిపాడు. కావాలనే ఎగురుతూ అతడు ఈ బెడ్స్ విరిగిపోవని ప్రూవ్ చేశాడు.

ఈ ట్వీట్‌ను ఒలింపిక్స్ అధికారిక ట్విట్టర్ ఖాతా కూడా షేర్ చేసింది. పుకార్లకు త్వరగా స్పందించింది అనుమానాలను తొలగించినందుకు మెక్‌క్లెనాఘన్‌కు కృతజ్ఞతలు తెలిపింది. "Thanks for debunking the myth, You heard it first from Team Ireland gymnast Rhys McClenaghan - the sustainable cardboard beds are sturdy!" అని ట్వీట్ లో ఉంది.

యుఎస్ఎ టుడే, ఎపి న్యూస్ వార్తాకథనాల ప్రకారం.. 2020 టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్ నిర్వాహకులు అథ్లెట్లకు నిద్రపోయేలా కార్డు బోర్డుతో తయారు చేసిన పడకలను అందించాలని నిర్ణయించారు. పడకలను జపాన్ సంస్థ ఎయిర్‌వీవ్ అందిస్తోంది. ఇది పాలిథిలిన్ దుప్పట్లతో 18,000 "హై రెసిస్టెన్స్ లైట్ వెయిట్ కార్డ్బోర్డ్" పడకలను అందిస్తోంది. పడకలు కరోనా కంటే ముందు రూపొందించబడ్డాయి. 100% పునర్వినియోగపరచదగినవి అని సంస్థ తెలిపింది. పర్యావరణ స్పృహను ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించారు. మంచం 200 కిలోగ్రాముల బరువును తట్టుకోగలవని.. చెక్కతో చేసిన బెడ్స్ కన్నా బలంగా ఉందని అథ్లెట్స్ విలేజ్ జనరల్ మేనేజర్ తకాషి కితాజిమా చెప్పుకొచ్చారు.

ఈ పడకలు "యాంటీ సెక్స్" ఉద్దేశ్యంతో తయారు చేయబడలేదని. జపాన్‌లో COVID-19 విస్తృతంగా వ్యాపించడం వల్ల అథ్లెట్లు సామాజిక దూరాన్ని కొనసాగించేలా తయారు చేయలేదని స్పష్టమవుతోంది.

కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.


Claim Review:టోక్యో ఒలింపిక్స్ లో యాంటీ సెక్స్ బెడ్స్ ను అథ్లెట్ల కోసం ఏర్పాటు చేశారా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Twitter
Claim Fact Check:False
Next Story