ప్రముఖ సామాజిక వేత్త అన్నా హజారే భారతీయ జనతా పార్టీలో చేరినట్లుగా కొన్ని ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఇందులో బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కూడా ఉన్నారు.
భారతీయ జనతా పార్టీ విధానాలు నచ్చడంతో అన్నా హజారే పార్టీలో చేరారని చెబుతూ ఉన్నారు. ఇందుకు సంబంధించిన పలు పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
माननीय श्री जेपी नड्डा की मौजूदगी में आज भारतीय जनता पार्टी की सदस्यता ग्रहण की!! అంటూ ట్విట్టర్ లో పెట్టిన పోస్టుకు 7వేలకు పైగా ట్వీట్లు రావడమే కాకుండా.. 2వేలకు పైగా రీట్వీట్లు వచ్చాయి.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న ఈ పోస్టులో ఎటువంటి నిజం లేదని.. న్యూస్ మీటర్ గుర్తించింది. వైరల్ అవుతున్న ఫోటోను మార్ఫింగ్ చేసినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది.
న్యూస్ మీటర్ టీమ్ ఈ ఫోటోపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా Navbharat Times లో అందుకు సంబంధించిన వార్త జూన్ 25, 2020న వచ్చింది. ఈ ఫోటోలో ఉన్నది జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు. ఈ ఫోటోలో ఉన్నది అన్నా హజారే కాదు.
Telegraph India, Indian Express, Tribune India వంటి మీడియా సంస్థల్లో కూడా ఒరిజినల్ ఇమేజ్ ను చూడొచ్చు.
Economic Times ఆర్టికల్ ప్రకారం సింధియా కాంగ్రెస్ పార్టీకి మార్చి 9, 2020న రాజీనామా చేశారు. మార్చి 11, 2020న భారతీయ జనతా పార్టీలో చేరారు. అన్నా హజారే భారతీయ జనతా పార్టీలో చేరినట్లుగా ఎటువంటి కథనాలు కూడా రాలేదు.
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఈ ఫోటోను మార్ఫింగ్ చేశారు.