FactCheck : లివర్ ఫెయిల్యూర్ కారణంగా అమితాబ్ బచ్చన్ ICUలో చేరారా..?
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కాలేయం దెబ్బతిని ఐసియులో చేరారని పేర్కొంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కాలేయం దెబ్బతిని ఐసియులో చేరారని పేర్కొంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జయ, అభిషేక్, అమితాబ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ లు ఉన్న ఒక ఫోటో ఫేస్ బుక్ పోస్ట్ తో పాటు ఒక లింక్ ను షేర్ చేస్తున్నారు.
"75% లివర్ దెబ్బతిని అమితాబ్ బచ్చన్ ఐసీయూలో చేరడంతో బచ్చన్ కుటుంబానికి ఇదొక విచారకరమైన వార్త" అనే క్యాప్షన్ వైరల్ పోస్టుల్లో ఉంది.
ఈ పోస్ట్ 7.1 మిలియన్లకు పైగా వ్యూస్, 28,000 ప్రతిచర్యలను సంపాదించింది, 3600 కంటే ఎక్కువ కామెంట్లు ఉన్నాయి. వాటిలో ఎక్కువ భాగం ఆయన కోలుకోవాలని కోరుతూ ఉన్నారు.
వైరల్ పోస్ట్‌లోని లింక్ జూన్ 3న ప్రచురించబడిన‘Title: Tragic News: Amitabh Bachchan Admitted to ICU with Severe Liver Damage,’ అనే టైటిల్ తో ఉన్న న్యూస్ ఆర్టికల్ పేజీకి మమ్మల్ని దారితీసింది.
బాలీవుడ్ నటుడు 75 శాతం కాలేయం దెబ్బతిన్నట్లు వెబ్‌పేజీ పేర్కొంది. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబం గోప్యత కోరుతోందని తెలిపింది.
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది. ఈ పోస్ట్ వీక్షకులను తప్పుదారి పట్టించడానికి, లింక్ చేసిన వెబ్‌సైట్‌కు క్లిక్స్ ఎక్కువ తీసుకురావడానికి నకిలీ కంటెంట్‌ను ఉపయోగిస్తోంది.
కీవర్డ్ సెర్చ్ ను ఉపయోగించి అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం గురించి తెలుసుకోడానికి ప్రయత్నించగా, ఆయన కాలేయం దెబ్బతినడం వల్ల ఆసుపత్రి పాలయ్యారని పేర్కొన్న వార్తల నివేదికలు లేదా సోషల్ మీడియా పోస్ట్‌లు మాకు కనిపించలేదు.
గోప్యత కోసం అభ్యర్థిస్తూ లేదా అమితాబ్ బచ్చన్ ఆసుపత్రి పాలయ్యారని పేర్కొంటూ బచ్చన్ కుటుంబం నుండి ఎటువంటి పత్రికా ప్రకటనలు లేదా సోషల్ మీడియా పోస్ట్‌లు లేవు.
అమితాబ్ బచ్చన్ అధికారిక X హ్యాండిల్‌లో, అభిషేక్ బచ్చన్ తాజా చిత్రం హౌస్‌ఫుల్ 5 పై చేసిన పోస్ట్ కూడా మాకు లభించింది.
T 5402 .. hahaha .. what a fun fun fun ... !!! https://t.co/OEA0Ht3MKu
— Amitabh Bachchan (@SrBachchan) June 5, 2025
జూన్ 10, 2025న కూడా అమితాబ్ బచ్చన్ ట్వీట్ వేశారు
వైరల్ పోస్ట్‌లోని వివిధ చిత్రాలు గతంలో వేర్వేరు సందర్భాల నుండి వచ్చాయని కూడా మేము కనుగొన్నాము. ఐశ్వర్య రాయ్ చిత్రం మార్చి 2017 లో ఆమె తండ్రి కృష్ణరాజ్ రాయ్ అంత్యక్రియల నాటిది.
అభిషేక్ బచ్చన్ చిత్రాలలో ఒకటి ఫిబ్రవరి 2017 నాటిది, అతను పొరుగువారి అంత్యక్రియలకు హాజరైనప్పుడు ఈ ఫోటోలను తీశారు.
మే 2022లో శివకుమార్ శర్మ అంత్యక్రియలకు హాజరైన జయా బచ్చన్ ఫోటోను కూడా ఈ వైరల్ పోస్ట్‌లో ఉపయోగించారు.
హాస్పిటల్ బెడ్ పై ఉన్న అమితాబ్ బచ్చన్ చిత్రం మరొక చిత్రానికి సంబంధించిన ఎడిటెడ్ వెర్షన్. ఈ చిత్రం Pinterest కు అప్‌లోడ్ చేశారు. అయితే, ఈ చిత్రం వివరాలను మేము స్వతంత్రంగా ధృవీకరించలేకపోయాము.
దీన్ని బట్టి వైరల్ పోస్ట్‌లోని ఇమేజ్ ప్రజల దృష్టిని ఆకర్షించడానికి సృష్టించారని మేము అర్థం చేసుకున్నాము. ఇవి బచ్చన్ కుటుంబానికి చెందిన ఇటీవలి చిత్రాలు కావు.
వెబ్‌పేజీ డొమైన్ ‘india.celebtoday24h’ అని ఉంది. లోగో “USA News” అని చెబుతుంది. అదే శీర్షికతో YouTube వీడియో వెబ్‌పేజీలో ఉంది. ఈ వీడియో జూన్ 3న అప్లోడ్ చేశారు. ఈ వీడియో కూడా వెబ్‌పేజీ మాదిరిగానే వార్తలను పంచుకుంటూ ఉంది. దీనికి 42,000 కంటే ఎక్కువ వ్యూస్ ఉన్నాయి.
ఈ వెబ్ సైట్ లో పలువురికి సంబంధించిన అసత్య కథనాలను మనం చూడొచ్చు. క్లిక్-బైట్, షాకింగ్ టైటిల్స్ తో అనేక కథనాలను మేము వెబ్‌సైట్‌లో చూశాము.
ఈ కథనాలు ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా రాశారు, పాఠకులను ఆకర్షించడానికి క్లిక్‌బైట్ శీర్షికలను ఇందులో ఉపయోగిస్తున్నారు.
వైరల్ అవుతున్న వాదనలు అబద్ధమని న్యూస్‌మీటర్ తేల్చింది. వీక్షకులను తప్పుదారి పట్టించడానికి, వెబ్‌సైట్‌కు క్లిక్స్ రావడానికి నకిలీ సంచలనాత్మక కంటెంట్‌ను ఉపయోగిస్తున్నారు.
Credits : K Sherly Sharon