పారిస్‌లోని ఈఫిల్ టవర్ సమీపంలోని ఒక వీధిలో పొగలు కమ్ముకున్న వీడియో, మంటలు వ్యాప్తి చెందుతున్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఫ్రాన్స్‌లో ఇటీవలి అల్లర్ల కారణంగా కొనసాగుతున్న హింసకు సాక్ష్యాలు అంటూ కొందరు పోస్టులు పెడుతూ ఉన్నారు.
గత కొన్ని రోజులుగా ఫ్రాన్స్ లో ఊహించని హింస కొనసాగుతూ ఉంది. కానీ కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాలను బయటపెట్టడం లేదంటూ పోస్టులు పెడుతున్నారు.
“France has witnessed unprecedented violence in the last few days. Coverage of the #FranceRiots by Western media is in stark difference to the similar violence in Delhi. Reactions of so-called Indian left-liberal is equally appalling. (sic)” అంటూ పోస్టును వైరల్ చేస్తున్నారు. లెఫ్ట్ లిబరల్స్ ఈ విషయం గురించి పెద్దగా నోరు మెదపడం లేదంటూ విమర్శలు గుప్పించారు.
నిజ నిర్ధారణ :
న్యూస్‌మీటర్ పరిశోధనలో ఈ చిత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టించారని.. ఇది వాస్తవ సంఘటనకు సంబంధించినది కాదని స్పష్టమైంది.
చిత్రాన్ని నిశితంగా పరిశీలిస్తే చాలా వైరుధ్యాలు కనిపిస్తాయి. చిత్రం కుడి వైపున, మంట మధ్యలో వ్యక్తులు నిలబడి ఉన్నారు. స్తంభం లేకుండా కుడివైపున గాలికి వేలాడుతున్న వీధి దీపం కూడా ఉంది.
Google Mapsలో, స్ట్రీట్ వ్యూను ఉపయోగించి, మేము పారిస్‌లోని వైరల్ చిత్రంలో కనిపించే భవనం, రహదారి కోసం వెతికాం. కానీ అలాంటి దృశ్యం ఏదీ దొరకలేదు.
మేము ఆప్టిక్ AIornot, హగ్గింగ్ ఫేస్ వంటి AI ఇమేజ్-డిటెక్టింగ్ సాధనాలతో ఈ చిత్రాన్ని విశ్లేషించాము. ఈ చిత్రం చాలా వరకూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రూపొందించారని నిర్ధారించబడింది.
ఈఫిల్ టవర్ సమీపంలో విధ్వంసాన్ని చూపుతున్న చిత్రం AI తో రూపొందించారని తెలిసింది. ఫ్రాన్స్‌లో ఇటీవల జరిగిన అల్లర్లతో దీనిని తప్పుగా లింక్ చేశారని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam