Fact Check : మధ్యప్రదేశ్ హోమ్ మినిస్టర్ 30 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేశారా..?

ABP News Screengrab Claiming MP Home Minister Rebelled Is Morphed. మధ్యప్రదేశ్ హోంమంత్రి 30 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Jun 2021 7:14 PM IST
Fact Check : మధ్యప్రదేశ్ హోమ్ మినిస్టర్ 30 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేశారా..?
మధ్యప్రదేశ్ హోంమంత్రి 30 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేశారని పలువురు సోషల్ మీడియా యూజర్లు పేర్కొన్నారు "నరోత్తం మిశ్రా 30 మంది ఎమ్మెల్యేలతో పాటు తిరుగుబాటు చేశారు" అని వైరల్ ఏబీపీ న్యూస్ బులిటెన్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను పలువురు షేర్ చేస్తూ వచ్చారు.


ఎంపి హోంమంత్రి నరోత్తం మిశ్రా, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్య గొడవలు జరిగాయని.. ఎబిపి న్యూస్ ప్రసారం చేసిందని.. అందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారంటూ సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను వైరల్ చేశారు.

నిజ నిర్ధారణ:

ఏబీపీ న్యూస్ బులిటెన్ కు సంబంధించిన ఈ ఫోటోలో 'ఎటువంటి నిజం లేదు'. ఇది మార్ఫింగ్ చేసిన ఫోటో..!

న్యూస్‌మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. 2020 సెప్టెంబర్‌లో ఇండోర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాస్క్ లేకుండా కనిపించినందుకు మిశ్రా క్షమాపణలు చెప్పిన ఘటనతో ఈ వైరల్ ఫోటోకు సంబంధం ఉందని భావించారు.

వార్తా నివేదికల ప్రకారం, COVID 19 మహమ్మారి సమయంలో (మాస్క్ ధరించకపోవటానికి కారణం ఏమిటని అడిగినప్పుడు) మిశ్రా మాట్లాడుతూ "నేను ధరించను, ఇప్పుడు ఏమి?" అని ఎదురుప్రశ్నించారు.

ఈ సంఘటన తర్వాత ఆయన క్షమాపణలు చెప్పాడమే కాకుండా ప్రజలందరూ మాస్కులను పెట్టుకోవాలని కోరారు. ఈ వైరల్ ఫోటోను కొన్ని నెలల కిందట తీశారు. అంతేకానీ ఇటీవలి కాలంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలకు ఎటువంటి సంబంధం లేదు.


మాస్క్ సంఘటనను ఎబిపి న్యూస్ కవర్ చేసినట్లు న్యూస్‌మీటర్ కనుగొంది. అయితే, బులెటిన్ వైరల్ స్క్రీన్ షాట్‌తో సరిపోలలేదు. ఫాంట్ శైలి, సైజ్, దిగువ శీర్షిక భిన్నంగా ఉన్నాయి. అసలు చిత్రంతో పోల్చినప్పుడు వైరల్ ఇమేజ్ హెడ్‌లైన్ పరిమాణంలో చాలా పెద్దదని మరియు టైమ్‌స్టాంప్ కూడా అసంపూర్ణంగా ఉందని గమనించవచ్చు.

తమ మధ్య ఎటువంటి గొడవలు లేవని నరోత్తం మిశ్రా చేసిన ట్వీట్‌ను కూడా మేము కనుగొన్నాము. తనకు ఇతర సభ్యుల మధ్య విభేదాలు లేవని.. ఆన్‌లైన్‌లో ప్రసారమయ్యే వార్తలు "పూర్తిగా నిరాధారమైనవి, తప్పుదోవ పట్టించేవి, అవాస్తవమైనవి" అని చెప్పుకొచ్చారు. శివరాజ్ సింగ్ చౌహాన్, వి.డి.శర్మ నాయకత్వంలో పార్టీ ఐక్యంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

దీన్ని బట్టి మిశ్రాకు శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఎటువంటి విబేధాలు లేవని.. వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ఏబీపీ న్యూస్ స్క్రీన్ షాట్ లో ఎటువంటి నిజం లేదని స్పష్టంగా తెలుస్తోంది.


Claim Review:మధ్యప్రదేశ్ హోమ్ మినిస్టర్ 30 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేశారా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Twitter
Claim Fact Check:False
Next Story