సామాజిక మాధ్యమాల్లో ఓ బస్సు యాక్సిడెంట్ కు సంబంధించిన ఫోటోను పోస్టు చేస్తూ ఉన్నారు. బిఎస్ఎఫ్ జవాన్ లను తీసుకుని వెళుతున్న వాహనానికి ప్రమాదం జరిగిందని.. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది జవాన్లు మరణించారని చెబుతూ ఉన్నారు. బీహార్ రాష్ట్రంలోని దర్భాంగా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుందని చెబుతూ ఉన్నారు. ఎలెక్షన్ డ్యూటీకి వారు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెబుతున్నారు.ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్.సి. డిపార్ట్మెంట్ వైస్ ప్రెసిడెంట్ తనూజ్ పూనియా కూడా ట్విట్టర్ లో ఇదే ఫోటోలను పోస్టు చేశారు.

ఆర్కైవ్ చేసిన లింక్ లు:

https://web.archive.org/save/https://www.facebook.com/NewsHelloindia/posts/209721030563580 https://web.archive.org/save/https://www.facebook.com/permalink.php?story_fbid=104694671452185&id=100917851829867 https://web.archive.org/save/https://twitter.com/AnkitBasti_INC/status/1324402899586224129

నిజ నిర్ధారణ:

బిఎస్ఎఫ్ జవాన్లను తీసుకుని వెళుతున్న బస్సుకు బీహార్ లోని దర్భాంగా-ముజఫ్ఫర్ నగర్ మధ్యన యాక్సిడెంట్ జరిగిన ఘటన 'నిజమే'. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది జవాన్లు మరణించారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

వైరల్ అవుతున్న ఫోటోలపై న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా నవంబర్ 5, 2020కి సంబంధించిన పలు మీడియా రిపోర్టులు లభించాయి.

Dainik Bhaskar కథనం ప్రకారం.. బిఎస్ఎఫ్ జవాన్లు ఎలెక్షన్స్ డ్యూటీలో భాగంగా ప్రయాణిస్తున్న వాహనం కత్రా పోలీసు స్టేషన్ పరిధిలోని చౌరా ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. దీంతో వాహనం పల్టీలు కొట్టింది. బస్సు డ్రైవర్ తో సహా పది మంది సైనికులు గాయపడ్డారు. స్థానికులు, బిఎస్ఎఫ్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని.. ప్రమాదంలో గాయపడ్డ సైనికులను సింహ్వాడా ఆసుపత్రికి తరలించారు.

ఆజ్ తక్ కథనం ప్రకారం కానిస్టేబుల్స్ అయినా అవినాష్ కుమార్, సంజయ్ భాయ్, హెడ్ కానిస్టేబుల్ డిడి మహంతో, డ్రైవర్ పూనియా, స్థానికుడైన భజరంగి సింగ్, జవాన్ రామచంద్ర, విశ్వజిత్ సమర్, సమీర్ కుమార్, ఎస్.కె.రవి, విజయ్ పసి, ధనంజయ్ కుమార్ లు గాయపడ్డారు. సింహ్వాడా ఆసుపత్రిలో వారికి చికిత్స అందించారు.

sanmarglive.com లో కూడా ఘటనకు సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేశారు. మూడో ఫేస్ ఎన్నికల్లో భాగంగా సెక్యూరిటీ నిమిత్తం జవాన్లను తరలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

తొమ్మిది మంది బిఎస్ఎఫ్ జవాన్లు బస్సు యాక్సిడెంట్ లో మరణించాడంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
సామ్రాట్

Next Story