FactCheck : కేరళలో నడుస్తున్న 250 ఎలక్ట్రిక్ బస్సులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందేనా..?

250 KSRTC Electric Buses running in Kerala are provided by the Centre. కేరళలో నడుస్తున్న KSRTCకి చెందిన 250 ఎలక్ట్రిక్ బస్సులు కేంద్ర ప్రభుత్వం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Aug 2022 9:15 PM IST
FactCheck : కేరళలో నడుస్తున్న 250 ఎలక్ట్రిక్ బస్సులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందేనా..?

కేరళలో నడుస్తున్న KSRTCకి చెందిన 250 ఎలక్ట్రిక్ బస్సులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవేనని సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా చెబుతున్నారు. ఈ పోస్టులలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చిత్రాలతో కూడిన పోస్టర్‌లుగా షేర్ చేయబడ్డాయి. "స్కీమ్ పేరు మార్చకండి; కేరళలో నడుస్తున్న 250 KSRTC ఎలక్ట్రిక్ బస్సులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఫేమ్ ఇండియా ఫేజ్ II పథకం కింద బస్సులు మంజూరు చేయబడిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభకు తెలియజేశారు. ఇప్పటికే చాలా మంది ఈ పోస్ట్‌లను ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో షేర్ చేశారు.



మేము వివిధ ఖాతాలలో అలాంటి సారూప్య కంటెంట్‌తో సోషల్ మీడియా పోస్ట్‌లను కనుగొనగలము. మలయాళ వార్తాపత్రిక 'జన్మభూమి' వెబ్‌సైట్‌లో 5 ఆగస్టు 2022న కూడా ఇలాంటి వార్త ప్రచురించబడింది.


నిజ నిర్ధారణ :

నిజ నిర్ధారణ చేస్తున్న మొదటి దశలో, కేంద్ర మంత్రిని ఉటంకిస్తూ ప్రధాన స్రవంతి మీడియా సంస్థ అయిన 'జన్మభూమి' ప్రచురించిన నివేదికను మేము పరిశోధించాము. వివిధ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు అదే విధంగా నివేదించినట్లు మేము కనుగొన్నాము. మాతృభూమి ఆన్‌లైన్‌ కూడా తమ నివేదికలో కేంద్రమంత్రి ప్రకటననే ఇచ్చింది. కానీ రాష్ట్రంలో నడుస్తున్న ఈ-బస్సుల కొనుగోలు గురించి నివేదిక ప్రస్తావించలేదు.

లోక్‌సభలో కేంద్ర మంత్రి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానాన్ని మేం పరిశీలించాం. ఎలక్ట్రిక్ వాహనాల ప్రమోషన్‌పై ఆగస్టు 4న లోక్‌సభలో ఎంపీ శ్రీ ఎన్‌కె ప్రేమచంద్రన్ అడిగిన ప్రశ్నకు నితిన్ గడ్కరీకి ఇచ్చిన సమాధానం ఆధారంగా వార్తలు, క్లెయిమ్‌లు ఉన్నాయని మేము కనుగొన్నాము.


ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు కోసం KSRTCకి ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందా.. ఏయే చర్యలు తీసుకుంది అన్నదే ప్రశ్న.


కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నుండి వచ్చిన సమాధానంలో కేరళకు FAME - II కింద 250 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేయబడ్డాయి. వాటిని జిల్లాల వారీగా విభజించారు. దీనితో పాటు KSRTC ద్వారా నిర్ణీత సమయ వ్యవధిలో దీనికి సంబంధించిన LoA జారీ చేయబడలేదు అనే మరో ప్రకటన కూడా సమాధానంలో ఉంది.


ముగింపు :

కేరళలో నడుస్తున్న KSRTCకి చెందిన 250 ఎలక్ట్రిక్ బస్సులను కేంద్రం ఇచ్చిందని సోషల్ మీడియాలో వస్తున్న వాదన అవాస్తవం. లోక్‌సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇచ్చిన ప్రత్యుత్తరంలో కొంత భాగంమే ఈ దావా అని మేము ధృవీకరించాము. ఈ పథకం కింద కేరళ బస్సులను కొనుగోలు చేయలేదని సమాధానమే నిర్ధారిస్తుంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఆంటోని రాజు, KSRTC నుండి ఈ అంశంపై అధికారిక ధృవీకరణను బట్టి సందర్భాన్ని మరింత స్పష్టంగా తెలియజేస్తుంది. KSRTC సిటీ సర్క్యులర్ సర్వీస్ కింద ఇప్పుడు 23 ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. "కేరళలో నడుస్తున్న 250 ఈ-బస్సులు" అని ఇచ్చిన హెడ్‌లైన్ కూడా తప్పు అని తేలింది.


కాబట్టి, వైరల్ అవుతున్న వార్తల్లో 'ఎటువంటి నిజం లేదు'.


Claim Review:కేరళలో నడుస్తున్న 250 ఎలక్ట్రిక్ బస్సులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందేనా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story