బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కాషాయపు రంగు స్కార్ఫ్ ధరించి, చేతిలో కత్తి పట్టుకుని ఉండగా.. చుట్టూ సిక్కులు ఉన్నారు. దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తూ ఉండగా వారికి మద్దతుగా హృతిక్ రోషన్ కూడా వచ్చారని చెబుతూ ఈ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ ఉన్నారు.
కంగనా రనౌత్ మాజీ లవర్ హృతిక్ రోషన్.. రైతులకు మద్దతుగా వచ్చి చేరారంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు.
ఇదే క్యాప్షన్ తో.. ఇదే ఫోటో ట్విట్టర్ లో కూడా వైరల్ అవుతోంది.
నిజ నిర్ధారణ:
ఈ ఫోటో గురు గోబింద్ సింగ్ జయంతి సందర్భంగా 2018 సంవత్సరంలో తీసిన ఫోటో. ప్రస్తుతం రైతుల ధర్నాకు.. హృతిక్ రోషన్ ఉన్న ఈ ఫోటోకు ఎటువంటి సంబంధం లేదు.
న్యూస్ మీటర్ ఈ ఫోటోను గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా జనవరి 6, 2018న యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియో దొరికింది. "Hrithik Roshan ATTENDS Celebrations Of Guru Gobind Singh Birth Anniversary" అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు. Bollywood Spy అనే యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియోను అప్లోడ్ చేయగా.. వైరల్ అవుతున్న ఫోటోను థంబ్నైల్ గా పెట్టారు.
ప్రముఖ మీడియా సంస్థలు జనవరి నెల 2018 సంవత్సరంలో హృతిక్ రోషన్ పాల్గొన్న ఈవెంట్ కు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేశాయి.
ఇదే ఈవెంట్ కు సంబంధించిన ట్వీట్లు కూడా జనవరి 6, 2018 న పోస్టు చేశారు. ఇదే ఈవెంట్ కు పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు.
2018లో గురు గోబింద్ జయంతి కార్యక్రమానికి హృతిక్ రోషన్ హాజరైన ఫోటోను.. ప్రస్తుతం జరుగుతున్న రైతు ఆందోళలకు లింక్ చేసి పోస్టులు పెడుతూ ఉన్నారు. వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.