జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. నగరంలోని 30 ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషన్. కొన్ని చోట్ల చిన్న చిన్న గొడవలు మినహా కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఫలితాల్లో టీఆర్ఎస్ కు 56 డివిజన్లు మాత్రమే దక్కాయి. బీజేపీ-48 విజయం సాధించగా.. ఎంఐఎం-44, కాంగ్రెస్-2 చోట్ల విజయం సాధించింది. ఎన్నికల కౌంటింగ్ కు ముందు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
వి6 తెలుగు ఛానల్ లో ఓ వీడియో వైరల్ అయింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ 17 సంవత్సరాల అబ్బాయిని పోలింగ్ ఆఫీసర్ గా నియమించిందంటూ వీడియోను పోస్ట్ చేశారు. అది తక్కువ సమయంలోనే వైరల్ అయింది.
నిజ నిర్ధారణ:
17 సంవత్సరాల అబ్బాయిని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ ఆఫీసర్ గా నియమించింది అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
ఆ అబ్బాయి గురించి ఎలెక్షన్ కమీషన్ ఓ స్టేట్మెంట్ ను విడుదల చేసింది. ఆ అబ్బాయిని వెబ్ క్యాస్టింగ్ కోసం మాత్రమే నియమించింది. కంప్యూటర్ కు సంబంధించిన సమాచారం ఉన్న విద్యార్థులను వెబ్ క్యాస్టింగ్ చేయడానికి ఎలెక్షన్ కమీషన్ నియమించింది. వయసుకు ఈ విధులకు ఎటువంటి సంబంధం లేదు.
https://www.ntvtelugu.com/post/telangana-election-commission-about-17-year-old-is-a-polling-officer-in-ghmc-elections-issue
https://www.v6velugu.com/17-year-old-boy-working-as-polling-officer-in-ghmc-elections-at-hyderabad/
https://tnews.media/national/రాష్ట్ర-వార్తలు-national/ఆ-అబ్బాయి-ఎన్నికల-విధులక/
ఈ అబ్బాయి కేవలం పోలింగ్ స్టాఫ్ తో కలిసి పోలింగ్ బూత్ లో కూర్చోగలడు.. వారితో కలిసి లంచ్ చేయగలడు. అతడికి ఎలెక్షన్ డ్యూటీకి ఎటువంటి సంబంధం ఉండదని చెప్పారు అధికారులు.
17 సంవత్సరాల అబ్బాయిని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ ఆఫీసర్ గా నియమించిందన్న పోస్టులు నిజం కావు.