FactCheck : 1098 కి ఫోన్ చేస్తే మిగిలిపోయిన ఫుడ్ ను తీసుకుని వెళ్తారా..?
1098 Childline does not collect surplus food viral-message is False. మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి పేద పిల్లలకు పంపిణీ చేసేందుకు ప్రధాని మోదీ
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 May 2022 7:35 PM ISTమిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి పేద పిల్లలకు పంపిణీ చేసేందుకు ప్రధాని మోదీ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారని సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొంటున్నారు. ప్రజలు 1098కి కాల్ చేయవచ్చని.. వెంటనే వాలంటీర్లు వచ్చి ఆ ఆహారాన్ని సేకరించి పేద పిల్లలకు పంపిణీ చేస్తారని వినియోగదారులు చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ హెల్ప్ లైన్ నెంబర్ ను లాంఛ్ చేశారని చెబుతూ ఉన్నారు.
"As announced By PM Modi-If you have a function/party at your home and when you see lots of food getting wasted, Pls don't hesitate to call 1098 (IN INDIA ONLY) - child helpline. They will come and collect the food...... (sic)," అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
https://www.facebook.com/100007313070069/posts/3139024129684659/
https://www.facebook.com/100036372135429/posts/689891185566613/
https://www.facebook.com/100063806893150/posts/399815092155384/
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
NewsMeter సంబంధిత కీవర్డ్స్ ను ఉపయోగించి Google సెర్చ్ ను నిర్వహించింది. 2016, 2017, 2018 నాటి వార్తా కథనాలను గుర్తించింది
మేము మే 17, 2022న PIB ఫాక్ట్ చెక్ సోషల్ మీడియా సైట్స్ నుండి వైరల్ పోస్టులు ప్రజలను తప్పుద్రోవ పట్టించేవిగా ఉన్నాయని చెబుతున్న ట్వీట్‌ను కనుగొన్నాము. అందులో "1098 అనేది చైల్డ్‌లైన్ ఎమర్జెన్సీ ఫోన్ నంబర్.. ఇది ఆపదలో ఉన్న పిల్లలకు సహాయం చేయడానికి సహకారం అందిస్తుంది. ఇది అవసరమైన వారికి ఆహారం తీసుకోదు/పంపిణీ చేయదు."
A #Fake message circulating on social media claims that you can call on '𝟭𝟬𝟵𝟴' to prevent food wastage at functions#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) May 17, 2022
▶️1098 is a childline emergency phone service that provides assistance to children in distress
▶️It doesn't pick up/distribute food to needy pic.twitter.com/y86K1CxTSr
ఉత్తరప్రదేశ్ ప్రాంతీయ ఔట్రీచ్ బ్యూరో చేసిన ట్వీట్ ప్రకారం చైల్డ్‌లైన్ 1098 అవసరమైన వారికి ఆహారాన్ని అందజేయదు లేదా పంపిణీ చేయదు.
A #Fake message circulating on social media claims that you can call on '𝟭𝟬𝟵𝟴' to prevent food wastage at functions@PIBFactCheck
— Regional Outreach Bureau, Uttar Pradesh (@adgroblko) May 17, 2022
▶️1098 is a childline emergency phone service that provides assistance to children in distress
▶️It doesn't pick up/distribute food to needy pic.twitter.com/hMlfPGVSu9
The Business standard లో 2018లో వచ్చిన కథనం ప్రకారం.. "పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ ఆన్‌లైన్‌లో తప్పుడు కథనాలతో సర్క్యులేట్ చేయబడిందని తెలిపారు. ఆ నెంబర్ పార్టీల తర్వాత మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించడం లేదని ఒక వివరణ ఇచ్చింది" అని నివేదిక పేర్కొంది.
మిగిలిపోయిన ఆహారాన్ని వృధా చేయకుండా తీసుకోవడానికి 1098కి కాల్ చేయాలని చెబుతున్న వైరల్ మెసేజీలు నిజం కాదు.
సంరక్షణ, రక్షణ అవసరమైన పిల్లల కోసం భారతదేశంలోని ఏర్పాటు చేసిన విస్తృతమైన పిల్లల ఫోన్ ఎమర్జెన్సీ ఔట్రీచ్ సర్వీస్ 1098 అని వెబ్‌సైట్‌లోని సందేశం పేర్కొంది.
https://www.childlineindia.org/a/about/childline-india
కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.