జన సేన పార్టీ ఆదేశాలను ధిక్కరించి ఆ పార్టి ఏకైక ఎం ఎల్ ఏ రాపాక వరప్రసాద రావు మూడు రాజధానుల బిల్లుకు మద్దత్తు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే, పార్టీ అధినేత ఆదేశాలను ధిక్కరించినందుకు ఆయన ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఒక ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అందులో “మూడు రాజధానుల అంశం మీద జగన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని జనసేన పార్టీ నిర్ణయాని వ్యతిరేకించి వైసీపి పార్టి కి అనుకూలంగా మాట్లాడుతూ తీర్మానంలో మద్దతు పలకడం. పార్టీని, పార్టీ ఆదేశాలు రాజోలు ఎమ్మెల్యే శ్రీ రాపాక వరప్రసాద రావు గారిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ తీర్మానాన్ని తోట చంద్రశేఖర్ గారు ప్రవేశపెట్టగా పార్టీ సభ్యులు అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి సస్పెండ్ చేయడం జరిగింది. ఇక మీదట ఆయన మాటలకు, నిర్ణయాలకు జనసేన పార్టికి ఎలాంటి సంబంధం ఉండదని తెలియజేస్తున్నాం.” ఈ ప్రెస్ నోట్ లో పవన్ కళ్యాణ్ సంతకం ఉంది.

Fact Check: Rapaka

నిజ నిర్ధారణ:

జన సేన పార్టీ అధికారుల ద్వారా కాని, వారి సోషల్ మీడియా అకౌంట్లలో గాని ఇలాంటి ప్రకటనలు ఏవి జారీ కాలేదు. అంతే కాకుండా, జనసేన పార్టీ మీడియా వింగ్ ఈ వార్తలను ఖండించింది. పార్టీకి సంబంధించిన ఎటువంటి ప్రకటన అయినా మొదలుగా పార్టీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో ప్రచురిస్తామనీ, వేరే ఎక్కడి సమాచారం నమ్మవద్దనీ వారు తెలిపారు.

ఎటువంటి సమాచారం కావాలన్నా మొదట జనసేన సోషల్ మీడియా వింగ్ ను సంప్రదించాలని వారు తెలిపారు.

Fact Check: Rapaka

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.