నిజ నిర్ధారణ- సాయిబాబా విగ్రహానికి వైకాపా జెండా కప్పేరా?

By అంజి  Published on  2 Dec 2019 2:05 PM IST
నిజ నిర్ధారణ- సాయిబాబా విగ్రహానికి వైకాపా జెండా కప్పేరా?

సోషల్ మీడియాలో ఇటీవల ఒక కథనం తెగ వైరల్ అవుతోంది. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి లో ఒక సాయిబాబా గుడిలో దేవతా విగ్రహానికి వైకాపా కార్యకర్తలు పార్టీ జెండా కప్పేరన్న ఈ కథనం లో నిజమెంత? అబద్ధమెంత?

నిజానికి ప్రభుత్వ భవనాలకు, గృహసముదాయాలకు తమ పార్టీ రంగును వైకాపా పెయింట్ చేసిందన కథనాలు వచ్చిన నేపథ్యంలో ఈ కథనం ప్రచారంలోకి వచ్చింది. పైగా చీపురుపల్లి బొత్త సత్యనారాయణ సొంత నియోజకవర్గం. దీంతో చాలా మంది దీనిని నమ్మేశారు.

న్యూస్ మీటర్ నిజ నిర్ధారణ -

అయితే ఆ గుడి పూజారి కథనం ప్రకారం అది పార్టీ జెండా కాదు. ఒక చీర. ఒక మహిళ ఆ చీరను సాయిబాబకు సమర్పించుకుంది. దానికి పీకో, ఫాల్స్ వంటివన్నీ ఉన్నాయని ఆయన చెప్పారు. ఆ చీరకు ఒక అంచు కూడా ఉందని ఆయన చెప్పారు. ఆయన ఈ మేరకు ఒక విడియో ను కూడా విడుదల చేశారు.

కాబట్టి న్యూస్ మీటర్ ఫ్యాక్ట్ చెక్ ప్రకారం సాయిబాబా విగ్రహానికి వైకాపా పార్టీ జెండాను కప్పారన్నది అవాస్తవం. నిజానికి అది ఒక చీర. వైకాపా పార్టీ రంగులతోనే ఉన్న ఒక చీరను మాత్రమే సాయిబాబా విగ్రహానికి కప్పడం జరిగింది.

Next Story