Fact Check : మాకు ఫేస్ మాస్క్ అవసరం లేదంటూ చూపించే కార్డులు వచ్చాయా..?
By న్యూస్‌మీటర్ తెలుగు
కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడం కోసం ఫేస్ మాస్క్ తప్పనిసరి చేశాయి పలు దేశాలు. దీంతో ప్రజలందరూ ఫేస్ మాస్క్ ను తప్పనిసరిగా వాడడం మొదలుపెట్టారు. బయటకు వచ్చే సమయంలో ప్రతి ఒక్కరూ మాస్క్ లు పెట్టుకుంటున్నారు.
ఇలాంటి సమయంలో ప్రత్యేకంగా ఓ కార్డును ఇస్తున్నారంట.. ఆ కార్డు ఎందుకంటే మేము మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఎవరైనా అధికారులకు చూపించడానికి..! అమెరికాలో ఈ కార్డుకు సంబంధించిన వార్తలు, ఫోటోలు బాగా వైరల్ అవుతోంది. డిజేబిలిటీస్ యాక్ట్ ఇన్ అమెరికా నిబంధనల ప్రకారం ఈ కొత్త కార్డును డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అమలులోకి తీసుకుని వచ్చిందని చెబుతున్నారు.
ల్యామినేషన్ చేసిన 'ఫేస్ మాస్క్ ఎగ్జెంప్ట్ కార్డు' అంటూ ల్యామినేషన్ చేసిన ఓ కార్డుకు సంబంధించిన ఫోటో వైరల్ అవుతోంది. “I AM EXEMPT FROM ANY ORDINANCE REQUIRING FACE MASK USAGE IN PUBLIC” అంటూ సోషల్ మీడియాలో ఈ కార్డుకు సంబంధించిన సమాచారాన్ని పోస్టు చేస్తున్నారు.
ఆ కార్డులో మాస్కులు వాడడం వలన మెంటల్/ఫిజికల్ రిస్క్ పొంచి ఉందని అందుకనే తాను మాస్క్ వేసుకోవడం లేదని తెలియజేస్తుందట ఆ కార్డు. అమెరికన్స్ విత్ డిజేబిలిటీ యాక్ట్ కింద ఈ కార్డును ఉపయోగించనున్నారు.
Right now, the data is showing that we need to hit the pause button on reopening. But if we all work together and wear face coverings, we can protect our loved ones and get our trends back in the right direction to restore our economy and beat this virus. https://t.co/iW0MuUYGQ8 pic.twitter.com/zOvvELNJmr
— Governor Roy Cooper (@NC_Governor) June 24, 2020
Not wearing it. pic.twitter.com/dxiSkZKz9S
— Americans for Truth & Justice❣️🇺🇸❣️ (@NadaSheep) June 24, 2020
నిజ నిర్ధారణ:
ఇది ఒక 'గాలి వార్త'.. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఇలాంటి కార్డును ఎవరికీ ఇవ్వలేదు.
ఈ కథనాలపై డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఓ స్టేట్మెంట్ ను విడుదల చేసింది. ఈ వార్తలన్నీ అబద్ధాలే అంటూ తేల్చి చెప్పింది.
ఇలాంటి కథనాలకు డిపార్ట్మెంట్ కు ఎటువంటి సంబంధం లేదని.. వీటిని నమ్మకూడదని తెలిపింది. ఏదైనా అఫీషియల్ సమాచారం కోసం అమెరికన్స్ విత్ డిజేబిలిటీ యాక్ట్(ఎడిఎ) వెబ్ సైట్ ను చూడాలని కోరారు. ADA.gov లో సరైన సమాచారాన్ని చూడాలని కోరారు.
https://www.ada.gov/covid-19_flyer_alert.html
అమెరికన్స్ విత్ డిజేబిలిటీ యాక్ట్ ఈ కథనాలను అబద్ధం అని తేల్చిన తర్వాత పలు మీడియా సంస్థలు ఈ వార్తలు అబద్ధమని తేల్చాయి.
https://edition.cnn.com/2020/06/26/us/face-mask-exemption-cards-doj-fraudulent-trnd/index.html
https://www.today.com/health/viral-face-mask-exemption-cards-are-fake-doj-warns-t185181
https://www.cnet.com/news/that-face-mask-exempt-card-thats-going-viral-is-totally-bogus/
ఫేస్ మాస్క్ అవసరం లేదంటూ చూపించే కార్డు ఒక 'గాలి వార్త'.. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కూడా ఇది అబద్ధం అని చెప్పుకొచ్చింది.