గబ్బిలాలు.. కరోనా వ్యాధి గురించి ప్రపంచమంతా చర్చించుకుంటూ ఉన్న సమయంలో గబ్బిలం గురించి కూడా బాగా చర్చించారు. కొందరు గబ్బిలాల నుండే కరోనా వైరస్ పుట్టుకొచ్చిందంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి సమయంలో సామాజిక మాధ్యమాల్లో మనిషి సైజు ఉన్నంత గబ్బిలం గురించి చర్చించుకుంటూ ఉన్నారు. ట్విట్టర్ యూజర్ అలెక్స్ మనిషి సైజున్నంత గబ్బిలాన్ని చూశానంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టడంతో ఆ పోస్టు కాస్తా వైరల్ అవుతోంది.

“Remember when I told y’all about the Philippines having human-sized bats? Yeah, this was what I was talking about” అంటూ పెద్ద గబ్బిలం ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఫిలిప్పీన్స్ లో మనిషి సైజున్నంత గబ్బిలాలు ఉన్నాయని.. వాటి గురించే తాను ఈరోజు మాట్లాడుతూ ఉన్నానని తెలిపాడు.

260k లైక్స్, 102.9K షేర్లు దక్కించుకున్నాయి.

ఇందులో నిజమెంత?

నిజ నిర్ధారణ:

మనిషి సైజున్న గబ్బిలాలు ఉన్నాయన్నది నిజమే..! ఫ్లైయింగ్ ఫాక్స్ అంటూ పిలుచుకునే భారీ గబ్బిలాలు ఫిలిప్పీన్స్ లో ఉన్నాయి. ఈ ఫోటోలో ఉన్న గబ్బిలం నిజమైనదే.. ఇది ఇప్పుడు తీసినది కాదు.. 2018లో తీసిన ఫోటో.

What do you do when you see a Flying Fox in your backyard? (The Philippines) from natureismetal

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ ఫోటోను రెడ్డిట్ పేజీలో చూడొచ్చు. Nature is Metal అనే రెడ్డిట్ పేజీలో దీన్ని ఉంచారు. అది కూడా ఒక సంవత్సరం క్రితం. 31.1 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. “What do you do when you see a Flying Fox in your backyard? (The Philippines).” ఎగిరే నక్కను మీ ఇంటి వెనుకభాగంలో చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటూ అందులో రాసుకొచ్చారు. తైవాన్ కు చెందిన న్యూస్ వెబ్ సైట్ లో ఆగష్టు 13, 2018న కథనాన్ని కూడా పబ్లిష్ చేశారు. ఫిలిప్పీన్స్ లో అరుదైన గబ్బిలం కనిపించింది అంటూ రాసుకుని వచ్చారు.

C1

https://www.taiwannews.com.tw/en/news/3505554

ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్(ఐయుసిఎన్) కూడా ఈ గబ్బిలం అంతరించిపోతున్న జాతికి చెందినదని చెబుతోంది. గోల్డెన్ క్యాప్ ఫ్రూట్ గబ్బిలం అని దీన్ని పిలుస్తారు. ఈ గబ్బిలాలు ఫిలిప్పీన్స్ లో కనిపిస్తూ ఉంటాయి. ఒక్కో రెక్క పొడవు దాదాపు 1.7 మీటర్లు ఉంటుంది. 7-11 ఇంచీల పొడవు ఉంటాయి. ఈ గబ్బిలాలు చాలా వరకూ శాఖాహార భోజనం తింటూ ఉంటాయి. ముఖ్యంగా పండ్లను తింటూ ఉంటాయి.. మనిషికి వీటి వలన ఎటువంటి ప్రమాదం ఉండదు.

అలెక్స్ పోస్ట్ చేసిన ఫోటో ఆరు సంవత్సరాల వయసు ఉన్న గబ్బిలానిది.

మనిషి సైజూ ఉన్న గబ్బిలం ఫిలిప్పీన్స్ లో ఉన్నాయన్నది ‘నిజమే’.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *