Fact Check : భారత్ లోనికి నదీ జలాలు రాకుండా భూటాన్ అడ్డుకుందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Jun 2020 9:37 AM GMT
Fact Check : భారత్ లోనికి నదీ జలాలు రాకుండా భూటాన్ అడ్డుకుందా..?

అస్సాం రాష్ట్రం బాస్కా జిల్లాలోని బగజూలి, కలిపుర్, హతిదూబా, శాంతిపూర్, పట్కిజూలి, బెల్ఖుతి, అంగర్కాతా గ్రామ వాసులు జూన్ 22న రోడ్ల మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. భూటాన్ లోని కాళింది నది నుండి తమకు వ్యవసాయానికి కావాల్సిన నీళ్లు అందడం లేదని వ్యవసాయానికి చాలా కష్టమైపోతోందని తమ బాధను వ్యక్తం చేశారు. భారత్-భూటాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. 6000 మంది రైతులు ఈ కాలువల మీదనే ఆధారపడ్డారు. తమ స్థానిక భాషలో వీరు నిరసన వ్యక్తం చేశారు.

అస్సాం రైతుల వ్యధలను విసరిస్తూ పలు వార్తా సంస్థలు కథనాలను ప్రచురించాయి. ఇలాంటి సమయంలో భూటాన్ కావాలనే భారత్ కు నీటిని రాకుండా ఆపేసిందని కొందరు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. నేపాల్, భూటాన్ దేశాలు ఇలాంటి పనులు చేయడం వెనుక చైనా హస్తం ఉందని ప్రచారం చేస్తున్నారు.

B1

B2

B3

https://www.eastmojo.com/assam/2020/06/24/now-bhutan-stops-irrigation-water-for-farmers-bordering-assam

https://nenow.in/north-east-news/assam/assam-baksa-farmers-resent-bhutans-decision-to-stop-irrigation-water.html

నిజ నిర్ధారణ:

భూటాన్ ప్రభుత్వం భారతదేశంలోకి నదీ జలాలను రాకుండా చేయాలని ప్రయత్నించిందన్న వార్తలు 'పచ్చి అబద్దం'.

ఏడు దశాబ్దాలుగా కాళింది నదికి చెందిన నీటిని భారత్ లోని 26 గ్రామాల వాసులు ఉపయోగించుకుంటూ ఉన్నారు. బాస్కా, ఉదల్ గిరి జిల్లాల్లోని గ్రామాలకు మనిషి నిర్మించిన ఈ కాలువల ద్వారా నీరు చేరుతున్నాయి. వర్షా కాలంలో కొందరు రైతులు కాలువల్లో అడ్డుకట్టలు వేసి.. ఆ నీటిని తమ తమ పంటపొలాలకు పంపిస్తూ ఉంటారు.

భూటాన్ కు చెందిన మీడియా అసోసియేషన్ ప్రెసిడెంట్ టెంజింగ్ లాంసంగ్ ఈ వార్తలను కొట్టివేశారు. కాళింది నదీ జలాలను అడ్డుకోవాలని భూటాన్ ప్రభుత్వం ప్రయత్నించిందన్నది పచ్చి అబద్ధమని చెప్పారు. సాధారణంగా ప్రతి ఏడాది అస్సాం రాష్ట్రానికి చెందిన రైతులు భూటాన్ లోకి వచ్చి తమ పంటపొలాలకు మళ్లిస్తూ ఉంటారు. కానీ ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా భూటాన్ భూభాగంలోకి ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు.

B4

అస్సాం ఛీఫ్ సెక్రెటరీ కుమార్ సంజయ్ కృష్ణ మాట్లాడుతూ భూటాన్ ప్రభుత్వం కావాలని కాళింది నదీజలాలను ఆపలేదని.. సాధారణంగా ఏర్పడిన కొన్ని అవరోధాల కారణంగా అస్సాం రైతులు నీటిని అందుకోలేకపోతున్నారని తెలిపారు.

B5

భూటాన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ కూడా ఈ ఘటనపై స్పందించింది. లాక్ డౌన్ కారణంగా అస్సాంకు చెందిన రైతులు భూటాన్ లోకి చేరుకోలేకపోతున్నారని.. భూటాన్ లోని సంద్రూప్ జోంగ్ఖర్ జిల్లాలో అధికారులు, ప్రజలు కలిసి నదిలో ఏర్పడ్డ అవరోధాలను తొలగిస్తూ ఉన్నారని.. వీలైనంత త్వరలో కాళింది నదీ జలాలు అస్సాంకు చేరుకుంటాయని అన్నారు.

B6

భూటాన్ ప్రభుత్వం కాళింది నదీ జలాలను భారత్ కు వెళ్లకుండా అడ్డుకుంటోందన్నది పచ్చి అబద్ధం.

Claim Review:Fact Check : భారత్ లోనికి నదీ జలాలు రాకుండా భూటాన్ అడ్డుకుందా..?
Claim Fact Check:false
Next Story