కరోనా మందు : ఫేస్ బుక్ 25 మిలియన్ డాలర్ల సాయం

By రాణి  Published on  29 March 2020 11:53 AM GMT
కరోనా మందు : ఫేస్ బుక్ 25 మిలియన్ డాలర్ల సాయం

యావత్ ప్రపంచంలో 200 దేశాలను తన గుప్పిట్లో పెట్టుకుని, కోట్లాది మంది ప్రజలను బెంబేలెత్తిస్తోన్న కరోనా వైరస్ (కోవిడ్ 19) కు మందు కనిపెట్టేందుకు బిలీనియర్లు తమ వంతు సాయంమందించేందుకు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. ఇప్పటికే టాటా గ్రూప్ రూ.1500 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. కరోనా పై పోరాటంలో భాగంగా దానికి విరుగుడు మందు కనిపెట్టేందుకు బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సంస్థ 125 మిలియన్లను ప్రకటించింది. ఇప్పుడు ఫేస్ బుక్ కూడా దానికి తోడైంది. ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ దంపతులు తమ దాతృత్వ సంస్థ చాన్ జుకర్ బర్గ్ ద్వారా 25 మిలియన్లివ్వనున్నట్లు ప్రకటించారు.

Also Read : పీఎం కేర్స్‌కు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ 100 కోట్ల విరాళం

అలాగే కరోనా పై పోరాడుతున్న ఇండియాకు సహాయమందించేందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్ తనవంతు విరాళాన్నిస్తున్నట్లు తెలిపింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ తరపున రూ.25 కోట్లు, బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్ తన వ్యక్తిగత సంపాదనలో రూ.25 కోట్లు ప్రధాని సహాయనిధికి అందించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా దేశ వ్యాప్తంగా ఉన్న 13 లక్షల మంది రైల్వే ఉద్యోగులు తమ ఒక్కరోజు వేతనాన్ని పీఎం రిలీఫ్ ఫండ్స్ కు ఇవ్వనున్నట్లు తెలిపారు. మొత్తం రూ. 151 కోట్లను భారత రైల్వే సంస్థ ప్రధాని సహాయనిధికి అందించనుంది.

Also Read : కరోనా వ్యాప్తికి మూలకారణమేంటో చెప్పిన..మొదటి పేషెంట్

Next Story