కరోనా వ్యాప్తికి మూలకారణమేంటో చెప్పిన..మొదటి పేషెంట్

By రాణి  Published on  29 March 2020 10:39 AM GMT
కరోనా వ్యాప్తికి మూలకారణమేంటో చెప్పిన..మొదటి పేషెంట్

కరోనా..ప్రస్తుతం ప్రపంచాన్ని గజగజలాడిస్తోన్న భయంకరమైన మహమ్మారి ఇది. అసలు ఈ వైరస్ ఎలా వ్యాపించింది. ఈ వైరస్ వ్యాప్తికి అసలు కారణమేంటి ? ఏం చేసి ఉంటే..ఈ విపత్తు ప్రపంచాన్నంతటికీ ప్రబలి ఉండేది కాదన్న విషయాలను వెల్లడించింది కరోనా సోకిన మొదటి పేషెంట్. అమెరికాకు చెందిన ఆంగ్ల పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కరోనా తొలి బాధితులరాలిని ఎట్టకేలకు గుర్తించింది. ఆమె వుహాన్ కు చెందిన వుయ్ జుషాన్. డిసెంబర్ 10వ తేదీన తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆమె..జనవరిలో పూర్తిగా కోలుకుని ప్రాణాలతో బయటపడ్డారు.

Also Read : ఇటలీలో ఆగని మృత్యు ఘోష

వుహాన్‌లోని హునన్‌ సముద్రజీవుల మార్కెట్లోనే జుషాన్ కూడా రొయ్యలను విక్రయించేవారు. ఉన్నట్లుండి డిసెంబర్ 10న ఆమెకు తీవ్ర జ్వరం, జలుబు రావడంతో స్థానిక ఆస్పత్రికి వెళ్లగా..అక్కడి వైద్యులు ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఇంటింకి పంపించేశారని తెలిపింది. తర్వాత మరింత నీరసపడిపోవడంతో వుహాన్ లోని ఎలవెన్త్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కూడా సరైన వైద్యం ఇవ్వకపోవడంతో అతిపెద్దదైన యూనియన్ ఆస్పత్రిలో డిసెంబర్ 16న చేరారు. ఆమె పరిస్థితిని పరిశీలించిన వైద్యులు వెంటనే రక్తపరీక్షలు చేశారు. ఆమెకు అతి ప్రమాదకరమైన వైరస్ సోకిందని తెలిపారు. అదే సమయంలో వుహాన్ లో ఉన్న ఆ మార్కెట్ నుంచి జుషాన్ కు ఉన్న లక్షణాలతోనే మరికొంతమంది కూడా ఆస్పత్రికి వచ్చారు. వారందరికీ కరోనా వైరస్ సోకిందని గుర్తించి..వెంటనే ఆ మార్కెట్ ను మూసివేయించారు.

Also Read : దేశంలో 25కు చేరిన కరోనా మృతుల సంఖ్య

అయితే ఈ వైరస్..కేవలం ఆ మార్కెట్ లో ఉన్న బాత్ రూమ్ నుంచి వ్యాపించిందంటున్నారు జుషాన్. మార్కెట్ లో ఉన్న బాత్ రూమ్ ను వినియోగించాకే తన శరీరంలో ఊహించని మార్పులొచ్చాయని పేర్కొన్నారు. అక్కడున్న విక్రేతల్లో చాలా మంది అదే బాత్రూమ్ ను వినియోగించడంతో..24 మంది విక్రయదారులు ఈ వైరస్ బారిన పడ్డారని తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం ముందే గ్రహించి కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకుని ఉంటే వైరస్ ఇంతలా వ్యాపించి ఉండేది కాదని, 30 వేల మందికి పైగా వైరస్ కు బలయ్యేవారు కాదని చెప్తున్నారు జుషాన్.

Also Read : నా టెలివిజన్ ఫ్యామిలీకి..చిన్న సహాయం : ప్రదీప్ మాచిరాజు

ది స్కూల్‌ లైఫ్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సైన్సెస్‌, స్కూల్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, యూనివర్శిటీ ఆఫ్‌ సిడ్నీ, చైనాలోని ప్రొఫెసర్లు నిర్వహించిన అధ్యయనం ఆధారంగా కరోనా వైరస్ మావులకు సోకే ఐదోరకమైన వైరస్ గా గుర్తించారు. ఈ తరహా వైరస్ లు అవి పుట్టిన ప్రాణి నుంచి భిన్నమైన ప్రాణిలోకి కూడా చేరి నివాసాన్ని ఏర్పరచుకుంటాయని కనుగొన్నట్లు వాల్ స్ట్రీట్ పత్రిక పేర్కొంది.

Next Story