దేశంలో కరోనా కోరలు చాచిన వేళ నుంచి చాలామంది కూలీలు వృత్తిని కోల్పోయి రోజు గడవడం కూడా కష్టంగా ఉంది. అలాగే సినిమా, సీరియల్స్, బుల్లితెర ఎంటర్ టైన్ మెంట్ షో ల షూటింగ్ లు సైతం నిలిచిపోయాయన్న విషయం విధితమే. దీంతో వాటికోసం పనిచేసే ఎంతో మంది కార్మికులు కూడా ఉపాధి లేకుండా ఉన్నారు. రోజూ జరిగే షూటింగ్ లో పనిచేసి ఆ రోజు వచ్చిన వేతనంతోనే వారి కుటుంబాలను పోషించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వారికోసం తనవంతు సహాయం అందించేందుకు బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు ముందుకొచ్చారు. తనకు తెలిసిన కార్మికుల కుటుంబాలకు నెలరోజులపాటు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో వీడియో షేర్ చేసుకున్నారు.

Also Read : సినీ కార్మికుల కోసం భారీ విరాళం ప్రకటించిన దగ్గుబాటి ఫ్యామిలీ

‘హాయ్‌.. నేను మీ ప్రదీప్ మాచిరాజు. ప్రస్తుతం సమాజంలో ఎలాంటి పరిస్థితులున్నాయో మనందరికీ తెలుసు ఏం జరుగుతుందో. బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉండడమే మంచిది. అదే ఎంతో ఉత్తమం కూడా. ఇళ్లకే పరిమితమవ్వడం వల్ల కరోనా గొలుసును మనం బ్రేక్‌ చేసిన వాళ్లం అవుతాం. మన ద్వారా వేరేవాళ్లకు గానీ.. వేరేవాళ్ల ద్వారా మనకి కానీ కరోనా రాకుండా ఆగుతుంది ఇది. ఇలాంటి లాక్ డౌన్ టైం లో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని కోరుతున్నాను. అయితే ప్రస్తుతం సినీ, బుల్లితెరలోని పనులు నిలిచిపోవడంతో షూటింగ్స్‌పైనే ఆధారపడి జీవితాన్ని కొనసాగిస్తోన్నవారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎన్నాళ్లుంటుందో తెలీదు. ఎన్ని రోజులు షూటింగ్ లు జరగకుండా ఉంటాయో చెప్పలేం. కాబట్టి నా వంతుగా నాకు తెలిసిన 50 నుంచి 60 రోజువారీ కార్మికుల కుటుంబాలకు ఒక నెల రోజులపాటు ఆర్థికసాయం చేయాలనుకుంటున్నాను. నా తరఫున ఇది చిన్న ప్రయత్నం మాత్రమే. ఎందుకంటే ఇది నా టెలివిజన్‌ ఫ్యామిలీ. నా షో ల కోసం వీరంతా ఎంతో సహాయం చేశారు. అలాగే మీకు తెలిసిన వాళ్ల గురించి మీరు కూడా తెలుసుకోండి. వాళ్లెరా ఉన్నారో ఫోన్ చేసి కనుక్కోండి. మీ వంతుగా వారికి ఆర్థిక సహాయం అందజేయండి. ’ అని ప్రదీప్‌ తెలిపారు.

Also Read : కరోనా పై సమరం : టాటా గ్రూప్ రూ.1500 కోట్ల విరాళం

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.