కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా సృష్టిస్తోన్న కల్లోలం అంతా ఇంతా కాదు. దీని దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చరిత్రలో ఎన్నడూ లేనంతగా కుదేలయింది. ఒక తుఫాను వచ్చినా ఇంత నష్టం జరగదు. కరోనాను ఎదుర్కొనేందుకు అమెరికా 6 ట్రిలియన్ డాలర్లు ప్రకటించిందంటే..ఈ వైరస్ వల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో అంచనా వేయొచ్చు.

Also Read : 100 కిలోమీటర్లు నడిచి.. ప్రాణాలు విడిచిన డెలివరీ బాయ్‌

భారత్ లో కూడా రోజురోజుకూ కరోనా ప్రభావం పెరుగుతోంది. ఆదివారం దేశ వ్యాప్తంగా 979 కేసులు నమోదయ్యాయి. మరోవైపు లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి సినీ, సీరయళ్ల షూటింగ్ లు సైతం ఆగిపోయాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, హాలీవుడ్ తో సహా అన్ని రకాల ఇండస్ట్రీల్లో పనిచేసేవారంతా ఇళ్లకే పరిమితమయ్యాారు. ఈ నేపథ్యంలో కరోనాతో పోరాడుతున్న తెలుగు రాష్ట్రాలకు, టాలీవుడ్ సినీ కార్మికులకు అగ్రనటులు, దర్శకులు, నిర్మాతలు తమవంతు విరాళాలను ప్రకటిస్తున్నారు. ఇప్పటి మెగాస్టార్ చిరంజీవి సినీ కార్మికుల కోసం రూ. కోటి విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తాజాగా దగ్గుబాటి కుటుంబం కూడా సినీ కార్మికుల కోసం రూ. కోటి విరాళం ఇవ్వనున్నట్లు తెలిపింది. సురేష్ ప్రొడక్షన్స్ యజమాని దగ్గుబాటి సురేష్, హీరోలు విక్టరీ వెంకటేష్, రానా లు కలిసి కోటి విరాళాన్ని సీసీసీ కి అందజేయనున్నారు.

Also Read : భారత్‌లో వెయ్యికి చేరువలో.. కరోనా పాజిటివ్‌ కేసులు

ఇప్పటి వరకూ అత్యధికంగా టాటా గ్రూప్ రూ.1500 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. అలాగే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రూ.25 కోట్లు విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సహాయనిధికి పవన్ కల్యాణ్, ప్రభాస్, నాగార్జున, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, దిల్ రాజు, త్రివిక్రమ్, అనిల్ రావిపూడి తదితరులు విరాళాలను ప్రకటించారు. కేవలం సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులే కాకుండా స్పోర్ట్స్ సంబంధిత వ్యక్తులు, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ వ్యాపారస్తులు, సాఫ్ట్ వేర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగస్తులు, కార్మికులు కూడా తమకు తోచిన విరాళాలను ప్రభుత్వాలకు అందజేస్తున్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.