కరోనా పై సమరం : టాటా గ్రూప్ రూ.1500 కోట్ల విరాళం

By రాణి  Published on  28 March 2020 3:35 PM GMT
కరోనా పై సమరం : టాటా గ్రూప్ రూ.1500 కోట్ల విరాళం

కరోనా పై పోరాటంలో భాగంగా అన్ని రంగాలకు చెందిన వ్యాపారస్తులు, సినీ నటులు, నిర్మాతలు, ప్రముఖులు, కార్మికులు, ఉద్యోగులంతా తమ వంతు సహాయాన్ని అందజేస్తున్నారు. తాజాగా శనివారం మధ్యాహ్నం టాటా ట్రస్ట్ తరపున కరోనా పై పోరాడేందుకు రూ. 500 కోట్ల విరాళం ప్రకటించగా..సాయంత్రం టాటా సన్స్ రూ.1000 కోట్లు విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా ప్రకటించారు.

Also Read : నర్స్ కు ఫోన్ చేసిన మోదీ..

భారత్ తో పాటు ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు తమ వంతు సాయమందిస్తున్నామన్నారు. కరోనా దెబ్బతో ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంతో కుదేలవుతుందన్నారు. దీంతో చాలా మంది పొట్టికూటి కోసం పడరాని పాట్లు పడుతూ..ప్రభుత్వ సహాయం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారని, వారి కోసం ఇంతమొత్తంలో విరాళం ప్రకటించినట్లు తెలిపారు. ప్రపంచం ఈ ఆర్థిక సంక్షోభం నుంచి త్వరగా కోలుకోవాలని రతన్ టాటా ఆశించారు.

Also Read :అమానుషం..కరోనా అనుమానితుడిని పట్టించుకోని వైద్యులు

శనివారం రాత్రికి భారత్ లో మొత్తం 909 కరోనా కేసులు నమోదవ్వగా..అత్యధిక కేసులు మహారాష్ట్రలో వెలుగుచూశాయి. తెలంగాణలో 65, ఏపీలో 14 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 7 లక్షలకు చేరువలో ఉన్నాయి. అత్యధికంగా అమెరికాలో లక్ష కరోనా కేసులు నమోదయ్యాయి. 29000 మందికి పైగా బాధితులు మృత్యుఒడికి చేరారు.

Next Story