ఎవరికైనా ఏ చిన్న దగ్గో, తుమ్మో వస్తేనే కరోనా వచ్చిందేమోనన్న అనుమానంతో ఆస్పత్రికి పరుగెడుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో జగ్గయ్యపేట వైద్యులు ఓ కరోనా అనుమానితుడి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇటీవలే అమెరికా నుంచి జగ్గయ్యపేటకు వచ్చిన యువకుడు తీవ్ర జ్వరంతో ఆస్పత్రికి వెళ్లాడు. అతనిని వెంటనే ఐసోలేషన్ కు తరలించి కరోనా టెస్టులు చేయాల్సిన వైద్యులు..ప్రాథమిక చికిత్స చేసి ఇంటికి పంపేశారు.

Also Read : తెలంగాణలో తొలి కరోనా మరణం

జ్వరం మరింత ఎక్కువవ్వడంతో ఆస్పత్రికెళ్లేందుకు అంబులెన్స్ కోసం ఎన్నిసార్లు ఫోన్ చేసినా సిబ్బంది సరిగ్గా స్పందించలేదు. గంటల తరబడి అంబులెన్స్ కోసం ఎదురుచూసిన యువకుడు..పరిస్థితి మరింత విషమించడంతో రోడ్డుపైనే పడిపోయాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, ఆరోగ్య కార్యకర్తలు..వేరే దారిలేక స్థానిక ఎమ్మెల్యే ఉదయభాను కారులో యువకుడిని ఆస్పత్రికి తరలించారు. సదరు యువకుడు అమెరికా నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో అతడికి కరోనా సోకి ఉంటుందన్న అనుమానంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పైగా కరోనా లక్షణాలతో ఆస్పత్రికెళ్లినా తాత్కాలిక చికిత్స చేసి పంపిన వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ ప్రబలుతున్న ఇలాంటి సమయంలో వైద్యులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదంటున్నారు.

Also Read : కరోనా బాధితుల వివరాలు షేర్ చేస్తే జైలుకే..

రాణి యార్లగడ్డ

Next Story