ముఖ్యాంశాలు

  • రెండు కుటుంబాలకు కరోనా నిర్థారణ
  • మొత్తం 65 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా సోకి నాంపల్లికి చెందిన 74 ఏళ్ల వృద్ధుడు మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. సదరు వ్యక్తి ఆరోగ్య సమస్యలతో గ్లోబల్ ఆస్పత్రిలో చేరగా..వైద్యం చేస్తుండగానే అతను మృతి చెందినట్లు తెలిపారు. చనిపోయాక అనుమానం వచ్చి కరోనా పరీక్షలు చేయించగా..కరోనా పాజిటివ్ అని తేలిందని మంత్రి వివరించారు. ఇటీవలే ఆ వ్యక్తి ఢిల్లీ నుంచి వచ్చినట్లు తెలిసిందన్నారు.

Also Read : కరోనా ట్రాకింగ్ యాప్..పోలీసుల వినూత్న ఆలోచన

ఆ వ్యక్తి కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్ లో ఉంచినట్లు తెలిపారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 65 కేసులు నమోదయ్యాయని మంత్రి పేర్కొన్నారు. వీరిలో పాతబస్తీలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి, కుత్భుల్లాపూర్ లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా సోకినట్లు గుర్తించామన్నారు. శుక్రవారం ఒక్కరోజే 10 కొత్త కరోనా కేసులు నమోదవ్వగా..శనివారం ఆరుగురికి కరోనా సోకినట్లు నిర్థారణయ్యాయని మంత్రి వెల్లడించారు. తెలంగాణలో మొత్తం 65 కరోనా కేసులు నమోదయ్యాయన్నారు.

Also Read : కరోనాపై పోరు: బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ భారీ విరాళం..

ఇప్పటి వరకూ విదేశాల నుంచి వచ్చిన వారికే కాకుండా వారి కుటుంబాలకు కూడా కరోనా సోకిందన్నారు. వీరి ద్వారా ఎవరికీ కరోనా వ్యాపించలేదని స్పష్టం చేశారు. గాలి ద్వారా కరోనా సోకుంతుందని వస్తున్నవన్నీ వదంతులేనని, వాటన్నింటినీ నమ్మి ప్రజలు భయభ్రాంతులు గురికావొద్దన్నారు. ఇది గాలి ద్వారా సోకే వ్యాధి కాదని మంత్రి తెలిపారు. అలాగే హైదరాబాద్ లో ఏ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించలేదన్నారు. సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ అవాస్తవాలని తెలిపారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.