మీ సేవలకు కృతజ్ఞతలు : నర్స్ తో ప్రధాని

By రాణి  Published on  28 March 2020 3:10 PM GMT
మీ సేవలకు కృతజ్ఞతలు : నర్స్ తో ప్రధాని

కరోనాను కట్టడి చేయడంలో అతి కీలకమైన పాత్ర పోషిస్తున్నారు వైద్యులు. కుటుంబాలను వదిలేసి పోలీసులు రాత్రనకా పగలనకా రోడ్లపై కాపలా కాస్తున్నారు. ప్రస్తుతం కరోనాను కట్టడి చేయడంలో అలుపెరుగని సేవలందిస్తున్న వైద్యులు, పోలీసులను అభినందించాల్సిందే.

దేశంలో వైద్యులంతా కరోనా బాధితులకు చికిత్సలందించడంలో నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో వైద్యులు చికిత్సలందిస్తున్న రోగులు ఎలా ఉన్నారు ? వారి ఆరోగ్య పరిస్థితి, మనోభావాల గురించి, అలాగే వైద్యుల అభిప్రాయాల గురించి తెలుసుకోవాలనుకున్నారు ప్రధాని మోదీ. అనుకున్నదే తడవుగా..పుణెలోని ఓ నర్సుకు ఫోన్ చేశారు. ఆమె నాయుడు ఆస్పత్రిలో పనిచేస్తున్న ఛయ్యా జగ్ తప్. ఈ విషయాన్ని స్వయంగా పూణె మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది.

Also Read : అమానుషం..కరోనా అనుమానితుడిని పట్టించుకోని వైద్యులు

మొదట మరాఠీలో సంభాషణ మొదలు పెట్టిన మోదీ ముందు జగ్‌తప్‌ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. కరోనా బాధితులకు సేవలందిస్తున్నందుకు కుటుంబ సభ్యులు భయపడుతున్నారా అని ప్రశ్నించగా..అందుకు నర్స్ ‘అవును’ అని సమాధానమిచ్చారు. ‘నేను నా కుటుంబం గురించి ఆలోచిస్తున్నా. కానీ ఎవరో ఒకరు పని చేయాలి కదా. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు సేవ చేయాల్సిందే. సర్దుకుపోతున్నాను’ అని ప్రధానికి సమాధానమిచ్చారు.

ఆస్పత్రిలో చేరిన వారు భయపడుతున్నారా ? అని మోదీ ఆరా తీయగా ‘మేం వారితో మాట్లాడుతున్నాం. భయపడాల్సిందేమీ లేదు. ఏం జరగదని భరోసా ఇస్తున్నాం. నెగెటివ్‌ వస్తుందని చెప్తూ వారిలో ధైర్యాన్ని నింపుతున్నాం’ అని జగ్‌తప్‌ తెలిపారు. ఇప్పటి వరకూ ఆస్పత్రి నుంచి ఏడుగురు కరోనా బాధితులు డిశ్చార్జ్‌ అయ్యారని చెప్పారు.

Also Read : కరోనా ట్రాకింగ్ యాప్..పోలీసుల వినూత్న ఆలోచన

దేశంలోని ఇతర ఆస్పత్రుల్లో సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి ఏమైనా సందేశం ఇస్తారా ? అని ప్రధాని అనగా ‘ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు. ఈ రోగాన్ని తరిమేసి మన దేశానికి విజయం అందించాలి. అన్ని ఆస్పత్రుల్లో ఉన్న సిబ్బంది ప్రధాన లక్ష్యం ఇదే కావాలి’ అని జగ్‌తప్‌ మోదీకి తెలిపారు. ‘మీలాగే.. లక్షల మంది నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, వైద్యులు తపస్సు చేస్తున్న రుషుల్లా దేశవ్యాప్తంగా పనిచేస్తున్నారు. నేను మిమ్మల్ని అభినందిస్తున్నా. మీ అనుభవాలు విన్నందుకు సంతోషంగా ఉంది’ అని ఆమెను ప్రధాని మోదీ అభినందించారు.

Next Story