ఇటలీలో ఆగని మృత్యు ఘోష

By రాణి  Published on  29 March 2020 9:20 AM GMT
ఇటలీలో ఆగని మృత్యు ఘోష

ఇటలీ లో పరిస్థితి రోజురోజుకీ మరింత దయనీయంగా మారుతోంది. అక్కడ మృత్యు ఘోష ఆగడం లేదు. రోజుకు వందల మంది కరోనాతో ప్రాణాలు కోల్పోతుంటే..వేల సంఖ్యలో కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. శనివారం మరో 889 మంది చనిపోవడంతో..అక్కడ మృతుల సంఖ్య 10 వేలు దాటింది. ఇప్పటి వరకూ 92,472 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు అత్యధికంగా నమోదైన దేశాల్లో మొదటి స్థానంలో అమెరికా ఉండగా, రెండవ స్థానంలో ఇటలీ ఉంది. వైరస్ కు మూలమైన చైనా మూడో స్థానంలో ఉంది. అత్యధిక కరోనా మరణాలు నమోదైన దేశాల్లో ఇటలీదే మొదటి స్థానం.

Also Read : నా టెలివిజన్ ఫ్యామిలీకి..చిన్న సహాయం : ప్రదీప్ మాచిరాజు

కాగా..ఇటలీలో కరోనా సోకిన వారి సంఖ్య వాస్తవ సంఖ్య కన్నా ఎక్కువగానే ఉండొచ్చని స్వయంగా వైద్యులే చెప్తున్నారు. అంత అందమైన దేశంలో ఆరోగ్య విపత్తు వస్తే ఎదుర్కొనేందుకు ఉన్న వైద్య పరికరాల సంఖ్య తక్కువే. దీంతో కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్న వారికి వైద్యులే పరీక్షలు చేస్తుండటంతో వారికి కూడా కరోనా సోకుతున్నట్లు తెలుస్తోంది.

Also Read :భారీగా పెరిగిన మాంసం ధరలు.. కిలో రూ. 800

Next Story