కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన ప్రధాని మోదీ.. ప్రజలెవరూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు. దీనికితోడు కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఇటీవల బడ్జెట్‌ను సైతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనికితోడు కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు పలువురు వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు కేంద్రానికి విరాళాలు అందజేస్తున్నారు. దీనిలో భాగంగా జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ కేంద్రానికి భారీ సాయాన్ని అందించింది. మహమ్మారి కరోనా వైరస్‌పై పోరాటానికి రూ. 100 కోట్ల భారీ విరాళాన్ని పీఎం కేర్స్‌కు కేటాయించినట్లు ప్రకటించింది.

Also Read :లాక్‌ డౌన్‌ కఠిన నిర్ణయమే.. అది మీ రక్షణ కోసమే

దీనికితోడు తమ ఉద్యోగులంతా ఒక రోజు వేతనాన్ని వితరణగా ఇస్తున్నట్లు తెలిపింది. ఈ ఈ సందర్భంగా జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ మాట్లాడుతూ.. కొవిడ్‌ -19 తో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో సాయం చేసేందుకు పీఎం కేర్స్‌కు రూ. 100 కోట్లు అందించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. కరోనా వైరస్‌ సోకిన వారికి సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కవచాలు, రోగులకు కృత్రిమ శ్వాస అందించి తగిన చికిత్స చేయడానికి అవసరమైన పరికరాలు, పరీక్షల సంఖ్య పెంచడానికి అనువైన టెస్టింగ్‌ కిట్లు కోసం ప్రత్యేక నిధులు కేటాయించినట్లు, సహాయ చర్యల్లో భాగంగా గ్రూప్‌ కంపెనీలను చాలా ప్రదేశాలను ఐసోలేషన్‌ వార్డులుగా మారుస్తున్నట్లు తెలిపారు. కోవిడ్‌ -19పై పోరాటంలో అన్ని విధాలుగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్