ప్రముఖ బడ్జెట్ హోటల్ చైన్ సంస్థ ‘ఫ్యాబ్ హోటల్స్’ 100 మందిని ఉద్యోగం నుండి తీసేసింది. ‘రీసోర్స్ ఆప్టిమైజేషన్’ ద్వారా ఉద్యోగులను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఆపరేషన్స్, టెక్, సేల్స్ అండ్ సప్లయ్ విభాగాల్లో పనిచేస్తున్న వాళ్ళను ఉద్యోగాల్లో నుండి తొలగించారని ఉద్యోగులు చెబుతున్నారు.

Also Read : ఇవి తినండి..రోగనిరోధక శక్తిని పెంచుకోండి

తొలగించిన ఉద్యోగులందరికీ ఇప్పటికే కంపెనీ నుండి లెటర్లు అందాయి. మీ రిపోర్టింగ్ మేనేజర్ తో కొద్దిరోజుల కిందటే టెలీఫోన్ లో మాట్లాడుతున్నామని.. ఉద్యోగస్థులను తగ్గించాలని సంస్థ అనుకుందని.. అందులో భాగంగానే ఉద్యోగం నుండి తొలగిస్తున్నామంటూ తెలిపింది. ఇకపై ఫ్యాబ్ హోటల్స్ లో మీరు ఉద్యోగులు కాదని.. మార్చి 30, 2020 సంస్థలో మీ ఆఖరి రోజు అని తీసివేయబడిన ఉద్యోగులకు తెలిపారు.

Also Read : కరోనా రాజకీయాలు..ఇదేం బుద్ధి అంటున్న ప్రతిపక్షాలు

కరోనా వైరస్ ప్రభావం పలు కంపెనీలపై పడింది. ఫ్యాబ్ కంపెనీ కూడా తీవ్ర నష్టాలను చవి చూస్తోంది. ఇప్పటికే మార్చి నెలలో భారీ నష్టాలు ఎదుర్కొన్న సంస్థ.. ఏప్రిల్ కూడా గడ్డు కాలమేనని అంటోంది. మిగిలిన ఉద్యోగులకు కూడా జీతాలు తగ్గించేశారు. సిటిసి ఆధారంగా ఉద్యోగుల జీతాల్లో కోతలను విధించారు. 25000 కంటే తక్కువ జీతం ఉన్న ఉద్యోగులకు 15 శాతం, 25000 కంటే ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగులకు 20 శాతం కోత విధించారు.

Also Read :ప్రభుత్వ వైఖరిపై నారా లోకేష్ ఫైర్

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.