బిగ్ బ్రేకింగ్ : మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్
By తోట వంశీ కుమార్ Published on 12 Jun 2020 8:43 AM ISTమాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అచ్చెనాయుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈఎస్‌ఐ కుంభకోణంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో ఆయన్ను అరెస్టు చేశారు.
వైసీపీ అధికారంలోకి రాగానే గత ప్రభుత్వ పాలనలోని అవినీతిపై విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. అందులో కార్మిక శాఖలోని ఈఎస్ఐ స్కాం వెలుగుచూసింది. ఈ భారీ కుంభకోణాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బయటపెట్టింది. ఈ కుంభకోణంలో టీడీపీ సీనియర్ నేత చంద్రబాబు రైట్ హ్యాండ్ అయిన నాటి మాజీ మంత్రి అచ్చెన్నాయుడి పాత్ర ఉందని దర్యాప్తులో తేలినట్టు సమాచారం.
నామినేషన్ పద్ధతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఇప్పించారని రిపోర్ట్ లో తేలింది. టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి తెచ్చారని.. నామినేషన్ల పద్ధతిలో కేటాయించాలని అచ్చెన్నాయుడు ఆదేశించారని విచారణలో వెలుగులోకి వచ్చింది. దీంతో అవినీతి జరిగిందని అచ్చెన్నాయుడు హస్తం ఉందని తేలడంతో ఏసీబీ అధికారులు ఈ ఉదయం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఆయన ఇంట్లో అరెస్టు చేసి సోదాలు కూడా నిర్వహించారు.