ఏపీలో 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jun 2020 10:06 AM GMT
ఏపీలో 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కేటీనేట్‌ సమావేశం జరిగింది. మార్చిలో ఓటాన్‌ అకౌంట్‌ను ప్రవేశపెట్టగా.. కరోనా కారణంగా వాయిదా పడిన బడ్జెట్‌ సమావేశాలను ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజున గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక జూన్‌ 19 నుంచి రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.

భోగాపురం ఎయిర్ పోర్టు, రామాయపట్నం పోర్టు నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చర్చ అనంతరం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. అంతేకాక వైఎస్సార్ చేయూత పథకానికి కెబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు నాలుగేళ్లలో 50 వేల ఆర్థిక సాయం అందించనుంది. వచ్చే ఆగస్టు 12న ఈ పధకం ప్రారంభించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన నివేదికను కెబినెట్‌ సబ్‌ కమిటీ సీఎంకు సమర్పించింది.

రామాయపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించి కేంద్రం నిధులపై ప్రధానంగా చర్చ జరిగింది. ఐదు దశల్లో పోర్టును నిర్మించనున్నారు. మొదటి దశలో రూ. 4736 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును చేపట్టనున్నట్లు సీఎం వివరించారు. ఆగస్టు నాటికి పోర్టు నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రామాయపట్నం పోర్టు టెండర్లను జూడిషీయల్ ప్రివ్యూకి పంపాలని సీఎం జగన్ ఆదేశించారు.

Next Story
Share it