స్కూబా డైవింగ్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ మరణించారు. సింగపూర్‌లో జరిగిన ప్రమాదంలో అతడు ప్రాణాలు వదిలాడు. నివేదికల ప్రకారం, సింగపూర్ పోలీసులు అతన్ని సముద్రం నుండి రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇంటెన్సివ్ మెడికల్ కేర్‌లో ఉంచినప్పటికీ, వైద్యులు అతడి ప్రాణాలు నిలబెట్టలేకపోయారు.
జుబీన్ సెప్టెంబర్ 20న నార్త్ ఈస్ట్ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి సింగపూర్‌లో ఉన్నారు. అతని ఆకస్మిక మరణం అభిమానులను, మొత్తం అస్సామీ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. భారతదేశ సంగీత పరిశ్రమను షాక్ కు గురిచేసింది.
జుబీన్ 'గ్యాంగ్‌స్టర్' చిత్రంలోని 'యా అలీ'తో ఖ్యాతిని పొందాడు, ఇది భారతదేశంలో చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. అతను 'దిల్ తు హి బతా' (క్రిష్ 3), 'జానే క్యా చాహే మాన్' (ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్) వంటి ఇతర బాలీవుడ్ హిట్‌లను కూడా పాడాడు. హిందీతో పాటు, అతను అస్సామీ, బెంగాలీ, నేపాలీ, అనేక ఇతర ప్రాంతీయ భాషలలో పాటలను రికార్డ్ చేశాడు.