భ‌యంక‌రంగా 'జాంబీరెడ్డి' ఫ‌స్ట్ బైట్‌..

Zombie Reddy First Bite. వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ.

By Medi Samrat  Published on  5 Dec 2020 9:16 AM GMT
భ‌యంక‌రంగా జాంబీరెడ్డి ఫ‌స్ట్ బైట్‌..

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. తాజాగా ఆయ‌న తెర‌కెక్కిస్తున్న చిత్రం 'జాంబీ రెడ్డి'. తేజ సజ్జా, ఆనంది, దక్ష ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రాన్ని యాపిల్ ట్రీ బ్యాన‌ర్ పై రాజ‌శేఖ‌ర్ నిర్మిస్తున్నారు. టైటిల్ అనౌన్సమెంట్ దగ్గర నుంచి ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి విషయం కూడా సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తూ వస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని స‌మంత చేతుల మీదుగా 'జాంబీ రెడ్డి' మూవీ ఫస్ట్ బైట్ వీడియోను విడుదల చేశారు.

'దైవం మనుష్య రూపేణా అన్నది ఇతిహాసం. రాక్షసం మనుష్య రూపేణా అన్నది ప్రస్తుతం' అంటూ సాగిన ఫస్ట్ బైట్ ఈ మూవీ నేపథ్యాన్ని తెలియజేస్తోంది.'భగవంతుని అద్భుత సృష్టిలో ఒకే ఒక పొరపాటు మనిషికి మేధా శక్తిని ఇవ్వడం. ఆ మేధా శక్తి తనకే ఒక ప్రశ్నగా నిలిస్తే దైవం నేర్పే గుణపాఠం మనిషి ఉనికికే ప్రమాదం' అంటూ వాయిస్ ఓవ‌ర్‌తోనే భ‌య‌పెట్టాడు ద‌ర్శ‌కుడు. ఆ తర్వాత వీడియోలో చూపించిన స‌న్నివేశాలు ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి.

కాగా 'జాంబీ రెడ్డి' సినిమా జాంబీల కాన్సెప్ట్ తో వస్తున్న మొట్ట మొదటి తెలుగు చిత్రం. కర్నూల్ బ్యాగ్రౌండ్ లో ఈ ఫిక్షనల్ జాంబీ నేపథ్యాన్ని చూపిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. కోవిడ్ నేపథ్యంలో ఇటీవలే చివరి షెడ్యూల్ ప్రారంభించిన చిత్ర యూనిట్.. షూటింగ్ మొత్తం పూర్తి చేసింది.Next Story