నేటి నుంచే.. క్రేజీఎస్ట్ ఫ్యామిలీ షో 'జీ సూపర్ ఫ్యామిలీ'

Zee Super Family Show Starts From Today. ఎప్పుడూ అందరిని ఆహ్లదంగా ఉంచడానికి చూసే జీ తెలుగు, ఈ ఆదివారం నుంచి

By Medi Samrat  Published on  17 April 2022 1:39 PM GMT
నేటి నుంచే.. క్రేజీఎస్ట్ ఫ్యామిలీ షో జీ సూపర్ ఫ్యామిలీ

ఎప్పుడూ అందరిని ఆహ్లదంగా ఉంచడానికి చూసే జీ తెలుగు, ఈ ఆదివారం నుంచి అందరికి మరిన్ని సంబరాలని అందివ్వడానికి 'జీ సూపర్ ఫామిలీ' అనే క్రేజీఎస్ట్ ఫ్యామిలీ షో తో తన అభిమానుల ముందరికి వస్తుంది. ప్రత్యేకతకి మరో పేరు జీ తెలుగు. అందుకే మెగా లాంచ్ ని మరింత వైభవంగా మార్చడానికి డీజే టిల్లు ఫేమ్ సిద్దు, నటుడు నిఖిల్ వారి మాతృమూర్తి తో షో కి విచ్చేశారు. సిద్ధూ తన సినిమా టైటిల్ సాంగ్ మీద డాన్స్ చేసి అందర్నీ అబ్బురపరిస్తే, నిఖిల్ 'వంద స్పీడ్ లో వస్తున్న' అనే పాట మీద డాన్స్ చేసి అందరి ఉత్తేజాన్ని మరింత పెంచారు. ఈ షో కి ఇంకాస్త సంబరాన్ని అంటిస్తూ, తెలుగు వారి ఆడపడుచు సుమ కనకాల విచ్చేశారు. అంతేనా జీ తెలుగు అభిమానుల కోసం ఒక రాప్ సాంగ్ ని పాడి అందరిని ఆశ్చర్యపరిచారు.

ధారావాహికల మధ్య సాగే రసవత్తరమైన పోరులో దేవతలారా దీవించండి , రౌడీ గారి పెళ్ళాం, ముత్యమంతా ముద్దు, ఊహలు గుసగుసలాడే, గుండమ్మ కథ, ఇంటి గుట్టు, మిఠాయి కొట్టు చిటమ్మ, వైదేహి పరిణయం, కళ్యాణ వైభోగం, కృష్ణ తులసి, రాధమ్మ కూతురు, కళ్యాణం కమనీయం, నెంబర్ 1 కోడలు, త్రినయని, ప్రేమ ఎంత మధురం, అగ్నిపరీక్ష, సూర్యకాంతం న‌టులు పాల్గొనగా, వారితో పాటు సూపర్ క్వీన్, స రి గ మ ప - ది నెక్స్ట్ సింగింగ్ ఐకాన్, స రి గ మ ప - ది సింగింగ్ సూపర్ స్టార్స్ యొక్క పార్టిసిపంట్స్ కూడా పాల్గొంటున్నారు. అందరూ గెలుచుకోవాలని చూసేది 'జీ సూపర్ ఫామిలీ' యొక్క క్రేజీఎస్ట్ టైటిల్.

షో కి యాంకర్ గా ప్రదీప్ మాచిరాజు వ్యవహరిస్తున్నాడు. పార్టిసిపెంట్స్ స్ఫూర్తి, సహనం, క్రేజీఎస్ట్ టైటిల్ గెలువాలనే పట్టుదల ఈ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. నేటి నుండి మొదలయ్యే ఈ క్రేజీఎస్ట్ ఫ్యామిలీ షో - 'జీ సూపర్ ఫామిలీ' మధ్యాహ్నం 12 గంటలకి మీ ముందుకు తీసుకురానుంది జీ తెలుగు. డోంట్ మిస్ ఇట్.













Next Story