టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఇంట తీవ్ర విషాదం..!

Young hero kiran abbavaram brother passed away. టాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీలో మరో విషాధ ఘటన చోటు చేసుకుంది. టాలీవుడ్‌ యువ హీరో ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

By అంజి  Published on  1 Dec 2021 7:05 AM GMT
టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఇంట తీవ్ర విషాదం..!

టాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీలో మరో విషాధ ఘటన చోటు చేసుకుంది. టాలీవుడ్‌ యువ హీరో ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం సినిమాతో తెలుడు ఆడియన్స్‌ను ఆలరించిన హీరో అబ్బవరం కిరణ్‌ సోదరుడు రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కడప జిల్లా చెన్నూరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో రామాంజులు రెడ్డి తీవ్రంగా గాయపడి మరణించారు. దీంతో అబ్బవరం కిరణ్‌ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. సంబేపల్లె మండలం దుద్యాల గ్రామంలో అబ్బవరం రామాంజులు రెడ్డి నివసిస్తున్నాడు.

'రాజవారు రాణివారు' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన కిరణ్‌ అబ్బవరం.. ఆ తర్వాత ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కెరీర్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కిరణ్‌ అబ్బవరంకు తన సోదరుడు మృతి చెందం పెద్ద కుదుపుగానే చెప్పవచ్చు.

వరుస విషాదాలతో తెలుగు సినీ పరిశ్రమ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. గత కొన్ని రోజుల క్రితం కరోనా కారణంగా శివశంకర్‌ డ్యాన్స్‌ మాస్టర్‌ కన్నుమూశారు. ఆ తర్వాత ప్రఖ్యాత సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. అంతకుముందు కూడా పలువురు సినీ ప్రముఖులు కన్నుమూశారు.

Next Story
Share it