స్టార్ కమెడియన్ షాకింగ్ నిర్ణయం.. ఈ ఏడాదితో సినిమాలకు ఫుల్ స్టాప్.!
Young comedian Rahul ramakrishna announced his retirement for movies. టాలీవుడ్ ఇండస్ట్రీలో యాక్టింగ్ ఇరగదీసే యువ నటుల్లో రాహుల్ రామకృష్ణ ఖచ్చితంగా ఉంటాడు. కమెడియన్‌గా, నటుడిగా రాహుల్‌కు
టాలీవుడ్ ఇండస్ట్రీలో యాక్టింగ్ ఇరగదీసే యువ నటుల్లో రాహుల్ రామకృష్ణ ఖచ్చితంగా ఉంటాడు. కమెడియన్‌గా, నటుడిగా రాహుల్‌కు సినీ ఇండస్ట్రీలో మంచి ఫేమ్ ఉంది. ప్రత్యేకమైన పాత్రల్లో నటిస్తూ రాహుల్.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇటీవల వచ్చిన 'జాతి రత్నాలు' సినిమాతో మాంచి క్రేజ్ తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ.. తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. 2020 ఏడాదితో సినిమాలకు ఫుల్‌స్టాప్ పెడుతున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించారు. ఇకపై సినిమాలు చేయనని, ఎవరూ ఏం అనుకున్నా పట్టించుకోనని, తన గురించి తనకు తెలుసు అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా తెగ వైరల్ అవుతోంది.
2022 is my last. I will not do films anymore. Not that I care, nor should anybody care
ఇప్పుడే సినిమా కెరీర్‌లో దూసుకుపోతున్న సమయంలో రాహుల్ రామకృష్ణ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనేది తెలియాల్సి ఉంది. కమెడియన్‌గా ఎంతో గుర్తింపు పొందిన రాహుల్ రామకృష్ణ నిర్ణయంపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ''ఎంది బ్రో అంత మాట అన్నావ్, అన్నా ఏమైంది, ఇదంత ప్రాంక్ కదా, నిజం చెప్పు రాహుల్, ఎదో సినిమా ప్రమోషన్ అయి ఉంటుంది.'' అంటూ పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. జయమ్ము నిశ్చయమ్మురా సినిమాతో తెరమీద కనిపించిన రాహుల్.. ఆ తర్వాత అర్జున్‌రెడ్డి సినిమాలో విజయదేవరకొండ స్నేహితుడిగా నటించాడు. ఆ తర్వాత కల్కి, స్కైలాబ్, జాతి రత్నాలు సినిమాల్లో అదుర్స్ అనిపించాడు.