ఓటీటీలో రైటర్ పద్మభూషణ్

Writer Padmabhushan Movie In OTT. సుహాస్‌ హీరోగా నటించిన రైటర్‌ పద్మభూషణ్‌ మంచి విజయాన్ని అందుకుంది.

By Medi Samrat  Published on  4 March 2023 9:30 PM IST
ఓటీటీలో రైటర్ పద్మభూషణ్

Writer Padmabhushan Movie


సుహాస్‌ హీరోగా నటించిన రైటర్‌ పద్మభూషణ్‌ మంచి విజయాన్ని అందుకుంది. ష‌ణ్ముఖ ప్ర‌శాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో ఆశీష్ విద్యార్థి, రోహిణి, టీనా శిల్ప‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. రైటర్‌ పద్మభూషణ్‌ ఫిబ్రవరి 3న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఓటీటీలోనూ అలరించిందుకు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ5’ రైటర్‌ పద్మభూషణ్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. మార్చి 22న ఉగాది సందర్భంగా ఈ సినిమాను ఓటీటీలో అందుబాటులోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసింది.. ఏరియా వైజ్ కలెక్షన్స్:

నైజాం (తెలంగాణ): రూ. 3.90 కోట్లు గ్రాస్

సీడెడ్ (రాయలసీమ): రూ. 80 లక్షలు గ్రాస్

ఆంధ్రప్రదేశ్ : 2.80 కోట్లు గ్రాస్

తెలంగాణ:+ ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 7.50కోట్లు షేర్ (రూ. 4.10 కోట్ల షేర్)

కర్ణాటక+ రెస్ట్ ఆఫ్ ఇండియా : రూ. 95 లక్షలు గ్రాస్

ఓవర్సీస్ : రూ. 3.60 కోట్లు గ్రాస్

వరల్డ్ వైడ్ గా రూ. 12.05 కోట్ల గ్రాస్ (రూ. 6.45 కోట్ల షేర్) వసూళ్లను రాబట్టింది.


Next Story