అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టిల‌ 'మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి'

Miss Shetty Mr Polishetty First Look. అనుష్క కొత్త సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు.

By Medi Samrat  Published on  1 March 2023 6:49 PM IST
అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టిల‌ మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి

అనుష్క కొత్త సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నవీన్ పోలిశెట్టి కాంబినేషన్లో ఆమె ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమాకి టైటిల్ ను ఖాయం చేస్తూ, ఒక పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాకి 'మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. వారి అసలు పేర్లతో టైటిల్ ను చూపించడం విశేషం. ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.

మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు రథన్ సంగీతం సమకూరుస్తున్నారు. నివర్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రాజీవన్ నంబియార్ ప్రొడక్షన్ డిజైనర్. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్. యూవీ క్రియేషన్స్ నుండి వస్తున్న 14వ సినిమా. అనుష్క శెట్టికి ఇది 48వ సినిమా కాగా.. నవీన్ పొలిశెట్టికి హీరోగా మూడో చిత్రం. అనుష్క నుండి చాలాకాలం తరువాత వస్తున్న మూవీ కావడంతో దీని పై అనుష్క ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.


Next Story