అఫిషియల్ : త్రివిక్ర‌మ్ నిర్మాణంలో జాతిర‌త్నాలు హీరో చిత్రం

Naveen Polishetty new movie update.ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Sep 2021 6:15 AM GMT
అఫిషియల్ : త్రివిక్ర‌మ్ నిర్మాణంలో జాతిర‌త్నాలు హీరో చిత్రం

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు న‌వీన్ పొలిశెట్టి. ఈ ఏడాది జాతిర‌త్నాలు చిత్రంతో బ్లాక్‌బాస్ట‌ర్ హిట్‌ను అందుకున్నాడు. ఈ చిత్రం త‌రువాత త‌న కొత్త సినిమాల‌పై ఎలాంటి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. అయితే.. మూడు చిత్రాల‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, మూడూ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ లతోనే అని నవీన్ పోలిశెట్టి ట్విట్టర్ వేదికగా ఇటీవ‌ల తెలిపాడు. ఈ నేప‌థ్యంలోనే బుధ‌వారం ఓ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది.

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్స్ లో నవీన్ తన నాలుగో చిత్రాన్ని చేయబోతున్నాడు. త్రివిక్రమ్ తన సొంత బ్యానర్ ఫార్చ్యూన్ 4 సినిమాస్‌ని ప్రారంభించి సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య, నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. తాజాగా మేకర్స్ ఓ అనౌన్స్ మెంట్ వీడియోని రిలీజ్ చేశారు.

జాతీ ర‌త్నాలు ద‌ర్శ‌క‌త్వ బృందంలో ప‌నిచేసిన క‌ళ్యాణ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానున్నాడు. ఇదిసితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న 15వ చిత్రం. త్వ‌ర‌లోనే ఈచిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంద‌ని తెలిపారు.

Next Story
Share it