అనుష్క డేట్స్ ఇప్పిస్తానని బెంగుళూరు తీసుకెళ్లి..

Cine Manager Yella Reddy. హీరోయిన్ అనుష్క శెట్టికి సినిమా ప్రపంచంలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

By Medi Samrat  Published on  25 Jan 2023 6:37 PM IST
అనుష్క డేట్స్ ఇప్పిస్తానని బెంగుళూరు తీసుకెళ్లి..

హీరోయిన్ అనుష్క శెట్టికి సినిమా ప్రపంచంలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమె చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. డేట్స్ ఇప్పిస్తానంటూ విశ్వకర్మ క్రియేషన్స్ అధినేత, వర్ధమాన నిర్మాత లక్ష్మణ్ చారీ నుంచి రూ. 51 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అనుష్క మాత్రమే కాకుండా.. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పేరు కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. అనుష్కతో సినిమా డేట్స్ ఇప్పిస్తానని సదరు నిర్మాతను పలుమార్లు బెంగుళూరు తీసుకెళ్లిన ఎల్లారెడ్డి రూ. 26 లక్షలు వసూలు చేశాడు. ఆ తర్వాత మణిశర్మతోనూ మూవీ కోసం మాట్లాడిస్తానని మరికొన్ని లక్షలు తీసుకున్నాడు. ఇలా మొత్తంగా రూ. 51 లక్షలు వసూలు చేసి అపాయింట్మెంట్ ఇప్పించలేదు. రోజులు గడుస్తున్నా ఇద్దరి అపాయింట్మెంట్ డేట్స్ ఇప్పించలేకపోవడంతో మోసపోయానని గ్రహించిన లక్ష్మణాచారి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు.

అంతకు ముందు ఎల్లారెడ్డి చేతిలో మోసపోయానని గుర్తించిన లక్ష్మణాచారి నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. ఎల్లారెడ్డిని ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు దొరై మందలించినా ఫలితం లేకుండా పోయింది. ఎంతకీ డబ్బులు ఇవ్వకపోవడంతో పోలీసులకు లక్ష్మణాచారి ఫిర్యాదు చేశాడు.


Next Story