గోల్డెన్ గ్లోబ్-విజేత నటుడు విల్ స్మిత్ 'పోల్ టు పోల్' అనే షోలో సందడి చేయనున్నారు. నేషనల్ జియోగ్రాఫిక్‌తో కలిసి కొత్త సాహస యాత్రను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. ది హాలీవుడ్ రిపోర్టర్ ప్రకారం.. నాట్ జియో హబ్‌లో భాగంగా డిస్నీ+లో ప్రసారం చేసే 'పోల్ టు పోల్' అనే సిరీస్ కు విల్ స్మిత్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. ఈ షోలో భాగంగా దక్షిణ ధ్రువం నుండి ఉత్తర ధ్రువం వరకు 26,000-మైళ్ల దూరం వెళతారు. భూమి మీద ఉన్న జీవరాశులను, దారిలో ఉన్న పలు తెగలతో సమయాన్ని వెచ్చిస్తారు.
దక్షిణ ధ్రువం నుండి ఉత్తర ధృవం వరకు ప్రయాణంలో స్మిత్‌ను అనుసరించే నాన్-ఫిక్షన్ సిరీస్ 'పోల్ టు పోల్'ను మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. పోల్ టు పోల్ అనేది నాట్ జియో డిస్నీ ప్లస్‌కు తీసుకువస్తున్న కొత్త కంటెంట్. వెల్‌కమ్ టు ఎర్త్ మరియు వన్ స్ట్రేంజ్ రాక్ తర్వాత నేషనల్ జియోగ్రాఫిక్‌తో స్మిత్ మూడవ ప్రాజెక్ట్‌గా పోల్ టు పోల్ చెప్పుకోవచ్చు. ఈ ధారావాహిక భూమి అంతటా విభిన్న ప్రాంతాలు, కమ్యూనిటీలు, ల్యాండ్‌స్కేప్‌లలో విస్తరించి ఉన్న విస్తారమైన ప్రయాణాన్ని కవర్ చేస్తుంది. ఈ సిరీస్ 100 రోజులకు పైగా చిత్రీకరించబడుతుంది. ప్రారంభ తేదీ, ప్రీమియర్ ఇంకా ప్రకటించబడలేదు. నాట్ జియో సోమవారం టెలివిజన్ క్రిటిక్స్ అసోసియేషన్ ముందు ప్రకటించిన అనేక సిరీస్ ఆర్డర్‌లలో 'పోల్ టు పోల్' ఒకటి.