సినీ పరిశ్రమ సమస్యలపై త్వరలో సీఎంతో చర్చిస్తాం: అల్లు అరవింద్‌

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన టాలీవుడ్ నిర్మాతల బృందంతో సమావేశమైంది.

By అంజి  Published on  24 Jun 2024 7:00 PM IST
film industry , CM Chandrababu, Allu Aravind, Tollywood, Pawankalyan

సినీ పరిశ్రమ సమస్యలపై త్వరలో సీఎంతో చర్చిస్తాం: అల్లు అరవింద్‌

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన టాలీవుడ్ నిర్మాతల బృందంతో సమావేశమైంది. సమావేశం అనంతరం అల్లు అరవింద్‌ మీడియాతో మాట్లాడారు. పవన్‌ కల్యాణ్‌ను సినీ పరిశ్రమ తరఫున అభినందించామని తెలిపారు. సీఎం చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ ఇప్పించమని పవన్‌ని కోరామని చెప్పారు. అన్ని అసోసియేషన్లు వచ్చి సీఎంను అభినందిస్తామని చెప్పారు. ఇండస్ట్రీ సమస్యలపై మరోసారి వచ్చి సీఎంను కలిసి చర్చిస్తామని తెలిపారు. సినిమా టికెట్ల రేటు పెంపు అనేది చిన్న విషయం, దాని గురించి చర్చించడానికి రాలేదు అని తెలిపారు.

ఈ సమావేశంలో తెలుగు సినిమాల బాక్సాఫీస్ రాబడిని మెరుగుపరచడానికి టిక్కెట్ ధరల పెంపు, అదనపు షోల ద్వారా సహాయం అందించాలని తెలుగు నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తారని మొదట ప్రచారం జరిగింది. అయితే తాము పవన్‌కు అభినందనలు తెలపాడానికి వచ్చామని అల్లు అరవింద్‌ తెలిపారు. అశ్విని దత్, మైత్రి నవీన్, చినబాబు, సుప్రియ, అల్లు అరవింద్, సురేష్ బాబు, డివివి దానయ్య, బివిఎస్ఎన్ ప్రసాద్, టిజి విశ్వ ప్రసాద్, ఇతరులతో సహా టాలీవుడ్ ప్రతినిధి బృందం.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో సమావేశమై అభినందనలు తెలిపారు.




Next Story