బాక్సాఫీసు వద్ద వీరయ్య వీర విహారం

Waltair Veerayya Record Collections. జనవరి 13న సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోకి వచ్చిన వాల్తేరు వీరయ్య కమర్షియల్ గా

By M.S.R  Published on  22 Jan 2023 8:30 PM IST
బాక్సాఫీసు వద్ద వీరయ్య వీర విహారం

జనవరి 13న సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోకి వచ్చిన వాల్తేరు వీరయ్య కమర్షియల్ గా మంచి సక్సెస్ ను అందుకుంది. మెగాస్టార్‌ చిరంజీవి, రవితేజ కలిసి నటించిన చిత్రం వాల్తేరు వీరయ్యపై మెగా అభిమానులను ఆకట్టుకుంటూ ఉంది. ఆ అంచనాలకు తగ్గట్టే కలెక్షన్స్‌ని రాబడుతూ వస్తోంది. తొలి మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది వీరయ్య. తొమ్మిది రోజుల్లో రూ.182 కోట్ల గ్రాస్‌(106 కోట్ల షేర్‌) వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వారిగా .. నైజాంలో రూ.28.87కోట్లు, సీడెడ్‌లో రూ.15.30 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.13.24 కోట్లు, గుంటూరు రూ.6.72 కోట్లు, కృష్ణ రూ.6.47 కోట్లు, నెల్లూరులో రూ.3.38 కోట్లతో షేర్‌ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ వాల్తేరు వీరయ్య 2 మిలియన్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.89కోట్లు సాధించాల్సి ఉండగా.. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అందుకుని రూ. 12కోట్లకు పైగా లాభాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వాల్తేరు వీరయ్యకు సంబంధించిన 25 ఫ్యాన్ షోస్‌ను 25 చోట్ల ఈ ఆదివారం అక్కడ టైమ్ ప్రకారం సాయంత్రం 6 గంటలకు ఒకేసారి నార్త్ అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో ప్రదర్శించనున్నట్టు ఈ సినిమాను అమెరికాలో డిస్ట్రిబ్యూట్ చేస్తోన్న శ్లోక ఎంటర్టైన్మెంట్ ప్రకటించింది.

Next Story