కొత్త పార్టీ ప్ర‌క‌టించ‌నున్న బిగ్‏బాస్ విన్న‌ర్‌ 'వీజే స‌న్నీ'

VJ Sunny Announcement of New Party. బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన వీజే సన్నీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు.

By Medi Samrat  Published on  27 Jun 2023 3:36 PM GMT
కొత్త పార్టీ ప్ర‌క‌టించ‌నున్న బిగ్‏బాస్ విన్న‌ర్‌ వీజే స‌న్నీ

బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన వీజే సన్నీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. ప్ర‌స్తుత రాజ‌కీయాల దృష్ట్యా తాను సొంత‌ రాజ‌కీయ పార్టీని స్టార్ట్ చేస్తున్న‌ట్లు తెలిపాడు. రేపు మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు నా పార్టీ అనౌన్స్‌మెంట్ ఉంటుంది.. మీ అంద‌రికీ మ‌రింత ద‌గ్గ‌ర‌వ‌డానికి పార్టీని ప్రారంభిస్తున్న‌ట్లు వెల్ల‌డించాడు. అంద‌రి స‌పోర్టు ఉంటుంద‌ని భావిస్తున్నాన‌ని ఓ వీడియో సందేశం విడుద‌ల చేశాడు.


బిగ్‏బాస్ సీజన్ 5 విజేతగా వీజే సన్నీ నిలిచాడు. 1989లో ఖమ్మంలో పుట్టిన స‌న్నీ అసలు పేరు అరుణ్ రెడ్డి. తల్లి కళావతి స్టాఫ్ నర్సుగా పనిచేస్తుండేవారు. సన్నీకి ఇద్దరు అన్నయ్యలు ఉజ్వల్, స్పందన్. సన్నీ స్కూలింగ్ ఖమ్మంలోనే పూర్తిచేశాడు. ఇంట‌ర్ క‌రీంన‌గ‌ర్‌, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో బీ.కామ్ పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్నాడు సన్నీ. జస్ట్ ఫర్ మెన్ అనే టీవీ షోతో యాంకర్‏గా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్లో రిపోర్టర్‏గా పనిచేశాడు. ఆ త‌ర్వాత‌ కళ్యాణ వైభోగం అనే టీవీ సీరియల్ ద్వార‌ బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఈ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు అందుకున్నాడు సన్నీ.. బిగ్‏బాస్ లో అవ‌కాశాన్ని అందిపుచ్చుకున్నాడు.


Next Story