తన సినిమాపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. వాటిని డిలీట్ చేయాలంటున్న విశ్వక్ సేన్
Vishwa Sen Comments On Ashoka Vanam lo Arjuna Kalyanam Movie OTT Release. 'అశోకవనంలో అర్జున కల్యాణం'.. టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా
By Medi Samrat Published on 9 May 2022 3:48 PM IST'అశోకవనంలో అర్జున కల్యాణం'.. టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా..! విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. మంచి కలెక్షన్స్ ను రాబడుతూ ఉంది. ఈ సినిమా అతి త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటూ కొందరు ప్రచారం చేస్తూ ఉన్నారు. పనిగట్టుకుని మరీ కొందరు చేస్తున్న ప్రచారం ఇదని కూడా వార్తలు వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అవుతూ ఉండడంతో విశ్వక్ సేన్ క్లారిటీ ఇచ్చాడు. తన సినిమా ఓటీటీ రిలీజ్ అంటూ పెట్టిన పోస్టులను డిలీట్ చేయాలని కోరాడు. సినిమా విజయం సాధించడం పట్ల ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ఇన్ స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ఇకపై మరిన్ని మంచి సినిమాలు తీసేలా తమకు ధైర్యాన్ని ఇచ్చారని అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.
తమ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ కానుందో డేట్‌తో సహా చెప్పేస్తున్నారని.. నిజానికి తామే ఇంకా ఓటీటీ రిలీజ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపాడు. తనకు కూడా ఓటీటీ విడుదల డేట్ తెలియదని, తాము ఫిక్స్ అయిన వెంటనే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పాడు. సినిమా ప్రస్తుతానికి సినిమా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోందని అన్నాడు. సోషల్ మీడియాలో కొందరు చేసిన పోస్టులపై వారందరికీ తాను చెప్పేది ఒక్కటేనని, సినిమా థియేటర్‌లో చూస్తే వచ్చే అనుభవం ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని.. దాన్ని మిస్ కావద్దని, అవాస్తవాలను ప్రచారం చేస్తే థియేటర్ లో సినిమా చూడాలనుకునేవారు సైతం ఓటీటీ విడుదలను దృష్టిలో ఉంచుకుని కొన్నిసార్లు సినిమా హాళ్లకు వెళ్లకుండా ఉంటారని చెప్పుకొచ్చాడు. అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా మంచి రెస్పాన్స్ ను అందుకుంటూ ఉంది. ఈ సినిమా రిలీజ్ కు ముందు ఓ ప్రాంక్ ను విశ్వక్ సేన్ చేయగా.. దానిపై ఓ ప్రముఖ టీవీ ఛానల్ రచ్చ రచ్చ చేసింది. ఈ సినిమాకు కావాల్సినంత ప్రచారం వచ్చింది.