విరూపాక్ష ట్రైలర్ వచ్చేస్తోంది

Virupaksha Movie Trailer Will Be Out Soon. మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ నటిస్తున్న సినిమా 'విరూపాక్ష'. కార్తిక్‌ దండు దర్శకుడిగా

By Medi Samrat  Published on  5 April 2023 6:23 PM IST
విరూపాక్ష ట్రైలర్ వచ్చేస్తోంది

మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ నటిస్తున్న సినిమా 'విరూపాక్ష'. కార్తిక్‌ దండు దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కాస్త డిఫరెంట్ గా అనిపిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్‌ 21న విడుదల కానుంది. తాజాగా మేకర్స్‌ ఈ సినిమా ట్రైలర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించారు. త్వరలోనే ట్రైలర్‌ రిలీజ్ కాబోతుందంటూ ఓ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. పోస్టర్‌లో సాయిధరమ్‌ తేజ్ వెనుక పక్షి రెక్కలు ఉన్నాయి. ఒక ఊరిని వరుస చావులు వెంబటిస్తుంటాయి. ఆ చావులకు గల కారణాలు ఏంటీ అని తెలుసుకోవాడానికి హీరో ఆ ఊరికి వెళ్తాడు. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది సినిమాలో చూడాల్సి ఉంటుంది. ఈ సినిమాకు సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు సహ నిర్మాతగాను వ్యవహరిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయి ధరమ్‌కు జోడీగా సంయుక్త హెగ్డే నటిస్తుంది.



Next Story