ఆస్కార్ అవార్డ్స్ లిస్ట్.. కమెడియన్ ను కొట్టిన విల్ స్మిత్

Viral - Will Smith Punches Chris Rock Over Joke About Wife. ఆస్కార్ అవార్డుల వేడుకలు లాస్ ఏంజెలెస్ లోని ఐకానిక్ డాల్బీ థియేటర్ లో ఘనంగా నిర్వహించారు.

By Medi Samrat  Published on  28 March 2022 7:48 AM GMT
ఆస్కార్ అవార్డ్స్ లిస్ట్.. కమెడియన్ ను కొట్టిన విల్ స్మిత్

ఆస్కార్ అవార్డుల వేడుకలు లాస్ ఏంజెలెస్ లోని ఐకానిక్ డాల్బీ థియేటర్ లో ఘనంగా నిర్వహించారు. 94వ అకాడెమీ అవార్డుల ప్రదానోత్సవానికి రెజీనా హాల్, అమీ షుమర్, వాండా సైక్స్ లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ ఏడాది ఉత్తమ నటీనటులుగా విల్ స్మిత్, జెస్సికా ఛస్టెయిన్ ఎంపికయ్యారు. గతంలో విల్ స్మిత్ రెండు సార్లు, జెస్సికా ఒక సారి ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయినప్పటికీ.. అవార్డును మాత్రం అందుకోలేకపోయారు.

విల్ స్మిత్ ఆస్కార్ వేదికపైకి దూసుకెళ్లి తన భార్య గురించి మాట్లాడినందుకు హాస్యనటుడు క్రిస్ రాక్‌ ముఖం మీద కొట్టాడు. ఆ వీడియో వెంటనే వైరల్ అయ్యింది. ఇది స్క్రిప్ట్‌తో రూపొందించబడిందా లేదా నిజమైనదా అని ప్రేక్షకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. రాక్, ఒక చిన్న కామెడీ రొటీన్‌తో ఉత్తమ డాక్యుమెంటరీ బహుమతిని అందజేస్తూ, జాడా పింకెట్ స్మిత్ జుట్టుపై జోక్ చేశాడు. దీంతో కోపంతో విల్ స్మిత్ వెళ్లి క్రిస్ రాక్ ను కొట్టాడు. ఈ ఘటనతో అక్కడ ఇబ్బందికరమైన నిశ్శబ్దం, గందరగోళం కనిపించింది. స్మిత్ తన సీటుకు తిరిగి వచ్చి అసభ్య పదజాలంతో అరిచాడు.

ఆస్కార్ అవార్డు విజేతల వివరాలు :

ఉత్తమ చిత్రం: "కోడా"

బెస్ట్ లీడ్ యాక్టర్: విల్ స్మిత్ ("కింగ్ రిచర్డ్")

ఉత్తమ నటి: జెస్సికా ఛస్టెయిన్ ("ది ఐస్ ఆఫ్ టామీ ఫే")

ఉత్తమ సహాయక నటుడు: ట్రాయ్ కోట్సూర్ ("కోడా")

ఉత్తమ సహాయ నటి: అరియానా డెబోస్ ("వెస్ట్ సైడ్ స్టోరీ")

ఉత్తమ దర్శకుడు: జేన్ కాంపియన్ ("ది పవర్ ఆఫ్ ది డాగ్")

బెస్ట్ ఒరిజినల్ సాంగ్: ("నో టైమ్ టు డై") బిల్లీ ఎలిష్, ఫిన్నియాస్ ఓ'కానెల్

బెస్ట్ డాక్యుమెంటరీ: "సమ్మర్ ఆఫ్ సోల్"

రచన (అడాప్టెడ్ స్క్రీన్ ప్లే): సియాన్ హెడర్ ("కోడా")

రచన (ఒరిజినల్ స్క్రీన్‌ప్లే): కెన్నెత్ బ్రనాగ్ ("బెల్ఫాస్ట్")
















Next Story