కోబ్రా టీజ‌ర్ :‌ ఓ వైపు‌ విక్ర‌మ్‌.. మ‌రోవైపు ఇర్ఫాన్‌ పఠాన్ అద‌ర‌గొట్టారు

Vikram Cobra Movie Teaser Release. హీరో చియాన్‌ విక్ర‌మ్.. వైవిధ్య‌మైన పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్రెస్.కోబ్రా టీజ‌ర్ :‌ ఓ వైపు‌ విక్ర‌మ్‌.. మ‌రోవైపు ఇర్ఫాన్‌ పఠాన్ అద‌ర‌గొట్టారు.

By Medi Samrat  Published on  9 Jan 2021 5:46 AM GMT
Kobra Movie teaser

హీరో చియాన్‌ విక్ర‌మ్.. వైవిధ్య‌మైన పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్రెస్. శివ‌పుత్రుడు, నాన్న‌, అప‌రిచితుడు, ఐ వంటి చిత్రాల‌తో త‌న న‌ట విశ్వ‌రూపం చూపించిన విక్ర‌మ్‌.. తాజాగా కోబ్రా అనే సినిమాతో అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఇందులో విక్ర‌మ్ ఏకంగా 20 పాత్ర‌లు పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో విక్ర‌మ్ మ్యాథ‌మెటిక్ జీనియ‌స్‌గా క‌నిపించ‌నున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వ‌ర‌కు విడుద‌లైన లుక్స్ ప్రేక్ష‌కుల‌లో సినిమాపై భారీ అంచ‌నాలు పెంచాయి.


అయితే.. తాజాగా చిత్ర యూనిట్‌ టీజ‌ర్ విడుద‌ల చేసింది. టీజ‌ర్ చాలా ఆస‌క్తిని రేకెత్తిస్తూ సినిమాపై అంచ‌నాల‌ను పెంచుతుంది. ముఖ్యంగా విక్ర‌మ్ న‌ట‌న ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. అలాగే.. టీమిండియా క్రికెట‌ర్ ఇర్ఫాన్‌ పఠాన్.. అస్లాన్ ఇల్మాజ్ పాత్రలో అద‌ర‌గొట్టాడు. ఇంకా ఈ సినిమాలో కేఎస్‌ రవికుమార్‌, శ్రీనిధి శెట్టి, మృణాలిని, కనికా, పద్మప్రియ, బాబు ఆంటోనీ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు.


Next Story