లియో సినిమాను అందరికంటే ముందే చూడాలనుకుంటున్నారా?
By Medi Samrat Published on 5 Oct 2023 9:00 PM ISTలియో సినిమా ట్రైలర్ అంచనాలను పెంచేసింది. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ వార్త కూడా వైరల్ అవుతూ ఉంది. ఈ చిత్ర బృందం భారతదేశం అంతటా పెయిడ్ ప్రీమియర్ షోలను ప్లాన్ చేస్తోందని అంతర్గత నివేదికలు సూచిస్తున్నాయి.
ఇక తమిళనాడు రాష్ట్రంలో ప్రత్యేక షోలకు అనుమతి లేదు. ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఆ సమయానికి భారతదేశంలో కూడా స్పెషల్ షోలు వేయాలని భావిస్తూ ఉంది. లియో బృందం తమిళనాడు బయట ప్రీమియర్‌ల కోసం ప్లాన్ చేస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి చాలా ప్రాంతాల్లో అర్ధరాత్రి సమయానికి షోలు వేశారు.. బెనిఫిట్ షోల కంటే ముందే ఈ షోలు పడడం విశేషం. ఇక లియో చిత్ర బృందం కూడా అదే తరహాలో షోలను వేయాలని అనుకుంటూ ఉంది. డిస్ట్రిబ్యూటర్లు కూడా పెయిడ్ ప్రీమియర్‌లనువేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రీమియర్స్ కు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఇతర భాషల్లోనూ ఈ సినిమా కు సూపర్ క్రేజ్ రానుంది. 15 ఏళ్ల తర్వాత విజయ్ - త్రిష కాంబో మళ్లీ రావడం సినిమాకు మరో హైలైట్. వీరిద్దరూ చివరిసారిగా కురువి (2008)లో కలిసి పనిచేశారు. మాస్టర్ తర్వాత విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ నుండి వస్తున్న మరో సినిమా లియో. ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, మిస్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, శాండీ కీలక పాత్రలు పోషించగా అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై లలిత్ కుమార్ లియో చిత్రాన్ని నిర్మించారు.