మరో సినిమాలో నటించేందుకు రాములమ్మ గ్రీన్‌ సిగ్నల్‌..?

Vijayashanthi Starring In Bharat Ratna Sequel. 22 ఏళ్ల కిందట నటించిన భారతరత్న అనే సినిమాకు సీక్వెల్‌గా రాబోయే సినిమాలోనే విజయశాంతి నటించబోతుందన్నట్లు వార్తలు వస్తున్నాయి.

By Medi Samrat  Published on  21 Feb 2021 11:44 AM IST
Vijayashanthi Starring In Bharat Ratna Sequel
విజయశాంతి.. ఒకప్పుడు క‌థానాయిక‌గా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ వంటి స్టార్‌ హీరోలతో ఆడి పాడింది. తర్వాత మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించి లేడి అమితాబ్‌ అనే ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. అదే సమయంలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తర్వాత సినిమాల‌కు చాలాకాలం గ్యాప్ ఇచ్చారు. గత ఏడాది మహేష్‌ బాబు హీరోగా నటించిన సరిలేరునీకెవ్వరు చిత్రంలో కీలక పాత్రలో నటించి సెకండ్ ఇన్నింగ్సు మొద‌లుపెట్టింది. ఆ సినిమాలో తనదైన నటనతో ఆ పాత్రకు జీవం పోశారు విజయశాంతి.


అయితే.. అప్ప‌టినుండి విజయశాంతి ఏదో ఒక‌ సినిమాలో నటిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. చాలా మంది దర్శక నిర్మాతలు రాములమ్మ కోసం క్యూ కట్టినా ఆమె సున్నితంగా తిరస్కరించారనే వార్త‌లూ వ‌చ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఓ సినిమాలో విజయశాంతి నటించబోతున్నారని తెలుస్తోంది. అది కూడా 22 ఏళ్ల కిందట నటించిన భారతరత్న అనే సినిమాకు సీక్వెల్‌గా రాబోయే సినిమాలోనే విజయశాంతి నటించబోతుందన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు ఆ సినిమాను నిర్మించిన ప్రతిమ ఫిలింస్‌ బ్యానరే ఈ సీక్వెల్‌ను నిర్మిస్తుందని టాక్‌ వినిపిస్తోంది. అయితే సినిమాలకు దూరమైన తర్వాత రాములమ్మ రాజకీయాలకే పరిమితం అయ్యారు. మహేష్‌బాబు సినిమాలో నటించిన తర్వాత మళ్లీ వెండితెరపైకి వస్తున్నారని భావించారు. అప్పటి నుంచి రాములమ్మకు సినిమాల్లో అవకాశాలు వచ్చినా.. తిరస్కరిస్తూ వచ్చారు. ఇప్పుడు తాజాగా మరో సినిమాకు అంగీకరించారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాములమ్మ సినిమాపై పూర్తిగా క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.


Next Story