విజయ్ వర్మ తమన్నాను ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడంటే.?
గత కొంత కాలంగా స్టార్ హీరోయిన్ తమన్నా భాటియాతో డేటింగ్ చేస్తున్నాడు నటుడు విజయ్ వర్మ.
By Medi Samrat Published on 26 Nov 2023 5:00 PM ISTగత కొంత కాలంగా స్టార్ హీరోయిన్ తమన్నా భాటియాతో డేటింగ్ చేస్తున్నాడు నటుడు విజయ్ వర్మ. తమన్నాను ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అని మీడియా నుండి ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నపై విజయ్ స్పందిస్తూ.. తన తల్లి కూడా ఇదే ప్రశ్న అడిగిందని.. అయితే తాను ఇంకా ఏ సమాధానం చెప్పలేదని అన్నాడు.
ప్రస్తుతం తన బెస్ట్ టైమ్ గడుపుతున్నానని మాత్రం విజయ్ వర్మ చెప్పాడు. మాన్‌సూన్ షూట్‌అవుట్ (2013) సినిమా రిలీజ్ కోసం చాలా కాలం పాటు ఎదురుచూశానని.. అదే తన జీవితంలో కష్టతరమైన సమయం అని చెప్పాడు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రశంసలు లభించాయని తెలిపాడు. ఈ సినిమా విడుదలైన తర్వాత తన జీవితం ఒక్కసారిగా మారిపోతుందని అనుకున్నానని, అయితే అది జరగలేదన్నాడు. మళ్లీ గేమ్‌లోకి రావడానికి చిన్న చిన్న పాత్రలను పోషించాల్సి వచ్చిందని అతను చెప్పాడు.
విజయ్ వర్మ, తమన్నా పలు ఈవెంట్లలోనూ, పార్టీలలోనూ కలిసి కనిపించిన సమయంలో వారి రిలేషన్ షిప్ గురించి పుకార్లు వచ్చాయి. తరువాత.. విజయ్, తమన్నాలు నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఒరిజినల్ ఆంథాలజీ లస్ట్ స్టోరీస్ 2లో మొదటిసారిగా కలిసి కనిపించారు. అదే సమయంలో తమ రిలేషన్ షిప్ ను అధికారికంగా ప్రకటించారు. కలిసి పలుమార్లు కనిపించారు. వివిధ ఇంటర్వ్యూలలో ఒకరి గురించి మరొకరు కూడా మాట్లాడారు.