పాజిటివ్ రివ్యూలు వచ్చినా కూడా డిజాస్టర్ అవుతోందే.?

విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ నటించిన 'మెర్రీ క్రిస్మస్' చిత్రం జనవరి 12న విడుదలైంది.

By Medi Samrat  Published on  16 Jan 2024 9:15 PM IST
పాజిటివ్ రివ్యూలు వచ్చినా కూడా డిజాస్టర్ అవుతోందే.?

విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ నటించిన 'మెర్రీ క్రిస్మస్' చిత్రం జనవరి 12న విడుదలైంది. అంధాధున్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. ట్రైలర్స్, పోస్టర్ల కారణంగా సినిమా మీద మంచి అంచనాలు వచ్చాయి. సినిమా విడుదలయ్యాక మంచి సమీక్షలు, విమర్శకుల నుండి ప్రశంసలు కూడా వచ్చాయి. ఈ సినిమా 2కోట్ల ఓపెనింగ్‌ వచ్చింది. శనివారం నాడు 3 కోట్లు వసూలు చేసింది. ఆదివారం నాడు కలెక్షన్లు అనుకున్నంత పెరగలేదు.. మొత్తం వారాంతపు కలెక్షన్లు సగటున 8 కోట్లు మాత్రమే ఉన్నాయి. సోమవారం నాడు సినిమా కలెక్షన్స్ లో ఊహించని డ్రాప్ చూసింది.

ఈ చిత్రం తమిళంలో కూడా విడుదలైంది. సినిమాలో విజయ్ సేతుపతి ఉన్నప్పటికీ తమిళ ప్రేక్షకులు.. శివకార్తికేయన్ అయాలాన్, ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్‌పై మాత్రమే ఆసక్తిని కనబరిచారు. పాజిటివ్ రివ్యూలు వచ్చినా కూసే సినిమాకు అనుకున్నంత కలెక్షన్స్ రావడం లేదు. మెర్రీ క్రిస్మస్‌లో సంజయ్ కపూర్, టిన్ను ఆనంద్, వినయ్ పాఠక్, ప్రతిమా కజ్మీ, రాధికా ఆప్టే, అశ్విని కల్సేకర్ కూడా నటించారు.

Next Story