అసలు నమ్మలేకపోతున్న రష్మిక.. ఇళయ దళపతి-వంశీ పైడిపల్లి సినిమా షురూ

Vijay, Rashmika Mandanna starrer begins with a formal puja ceremony in Chennai. వంశీ పైడిపల్లి- ఇళయ దళపతి విజయ్ కాబినేషన్ లో రాబోయే చిత్రం గురించి తెగ చర్చించుకుంటూ ఉన్నారు

By Medi Samrat  Published on  6 April 2022 2:45 PM GMT
అసలు నమ్మలేకపోతున్న రష్మిక.. ఇళయ దళపతి-వంశీ పైడిపల్లి సినిమా షురూ

వంశీ పైడిపల్లి- ఇళయ దళపతి విజయ్ కాబినేషన్ లో రాబోయే చిత్రం గురించి తెగ చర్చించుకుంటూ ఉన్నారు. భారీ అంచనాల నేపథ్యంలో ఈరోజు చెన్నైలో నటీనటులు, సిబ్బందితో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు విజయ్, రష్మిక పోషిస్తూ ఉన్నారు. ఇళయదళపతి విజయ్ తో సినిమా అంటే రష్మిక కళ్లల్లో ఎంతో ఆనందం కనిపించింది. విజయ్ కు రష్మిక దిష్టి కూడా తీయడం విశేషం.

ఏప్రిల్ 6న చెన్నైలో విజయ్-66వ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. పూజా కార్యక్రమం నుండి టీమ్ మొత్తం నవ్వులతూ పోజులిచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ బ్లూ షర్ట్‌లో కనిపించగా, రష్మిక లేత ఆకుపచ్చ లెహంగాలో చాలా అందంగా కనిపించింది. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తూ ఉన్నాడు.

ఏప్రిల్ 5న రష్మిక పుట్టినరోజు సందర్భంగా, దళపతి 66 నిర్మాతలు ఆమె ఈ సినిమాలో నటించబోతోందంటూ అధికారిక ప్రకటన చేశారు. ఆమె లాంచ్ వేడుకకు హాజరు కావడానికి చెన్నైకి వెళ్లింది. ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ దీనిని నిర్మించారు. నటీనటులు, సిబ్బందికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించబడతాయి. విజయ్-నెల్సన్ దిలీప్‌కుమార్‌ కాంబినేషన్ లోని బెస్ట్ విడుదల కోసం అందరూ ఎదురు చూస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటించగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. బీస్ట్ ఏప్రిల్ 13న విడుదల కానుంది.

Next Story
Share it